Suden shok: ఆమెకు భూమ్మీద నూకలు ఉన్నట్టున్నాయ్.. జస్ట్ కొద్దిలో మిస్ అయింది.. వీడియో వైరల్..

ABN , First Publish Date - 2021-10-09T01:16:49+05:30 IST

యూస్ఏ హైవే నంబర్ 23పై ఇద్దరు పోలీసులు మాట్లాడుకుంటున్నారు. వారిలో జెస్సికా అనే మహిళా పోలీసుకు మాథ్యూ స్టీవర్ట్‎ అనే పోలీసు.. ఏదో చెబుతూ ఉన్నాడు. అంతలోనే ఒక్కసారిగా ఓ వాహనం వేగంగా దూసుకొచ్చింది.

Suden shok: ఆమెకు భూమ్మీద నూకలు ఉన్నట్టున్నాయ్.. జస్ట్ కొద్దిలో మిస్ అయింది.. వీడియో వైరల్..

ఒక్కోసారి కొందరు చిన్న చిన్న ప్రమాదాల్లోనూ ప్రాణాలు కోల్పోతుంటారు. మరి కొందరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ప్రమాదానికి గురవుతూ ఉంటారు. అలాగే కొన్నిసార్లు ఘోరమైన ప్రమాదాలు జరిగినా.. దెబ్బలేమీ లేకుండా బయటపడుతుంటారు. అలాంటప్పుడు.. వీడికి భూమ్మీద ఇంకా నూకలు ఉన్నాయ్ రా.. అని అంటూ ఉంటాం. యూఎస్ఏలో కూడా ఇలాగే జరిగింది...


యూస్ఏ హైవే నంబర్ 23పై ఇద్దరు పోలీసులు మాట్లాడుకుంటున్నారు. వారిలో జెస్సికా అనే మహిళా పోలీసుకు మాథ్యూ స్టీవర్ట్‎ అనే పోలీసు.. ఏదో చెబుతూ ఉన్నాడు. అంతలోనే ఒక్కసారిగా ఓ వాహనం వేగంగా దూసుకొచ్చింది. రెప్ప పాటులో ఆ మహిళను ఢీకొంటుందనగా.. మాథ్యూ స్టీవర్ట్‎ గమనించి, మహిళా పోలీసును పక్కకు లాగాడు. వేగంగా వచ్చిన ఆ వాహనం.. పోలీసు వాహనాన్ని ఢీకొంది.


అదే సమయంలో అక్కడ ఉన్న వారు ఇది చూసి షాక్ అయ్యారు. ఎవరికీ ఎలాంటి గాయాలూ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.  కారు డ్రైవర్ నియంత్రణ కోల్పోయినట్లు తేలింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను.. వర్జీనియాలోని గేట్ సిటీ పోలీసు విభాగం సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. మహిళా పోలీసును కాపాడిన మాథ్యూ స్టీవర్ట్‌ను.. అంతా ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.



Updated Date - 2021-10-09T01:16:49+05:30 IST