Abn logo
Jul 5 2020 @ 05:44AM

ఈవీఎం గోదాములను పరిశీలించిన కలెక్టర్‌

నల్లగొండ టౌన్‌, జూలై 4 : కలెక్టరేట్‌ సమీపంలోని గోదాముల్లో భద్రపరిచిన ఈవీఎంలను కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ అదనపు కలెక్టర్‌ వి.చంద్రశేఖర్‌తో కలిసి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఈసీఐ నిబంధనలు అనుగుణంగా అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి ప్రతి మూడు నెలలకోసారి ఈవీఎంలను పరిశీలిస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డి, ట్రైనీ అసిస్టెంట్‌ కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌, తహసీల్దార్‌ నాగార్జున్‌రెడ్డి, కలెక్టర్‌ ఏవో మోతీలాల్‌, ఇతర అధికారలు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement