నల్లమట్టి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి

ABN , First Publish Date - 2022-06-14T05:25:04+05:30 IST

నియోజకవర్గంలో నల్లమట్టి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

నల్లమట్టి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి నాగం

- విలేకరుల సమావేశంలో మాజీమంత్రి నాగం జనార్దన్‌రెడ్డి


నాగర్‌కర్నూల్‌ టౌన్‌, జూన్‌ 13: నియోజకవర్గంలో నల్లమట్టి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో నాగం విలేకరుల సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వట్టెం రిజర్వాయరు పేరుతో అనుమ తులకు మించి చెరువుల్లో నల్లమట్టిని కాంట్రాక్టరుతో కుమ్మకై అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు ఇష్టానుసారంగా దోచుకుంటున్నారని ఆరోపించారు. నల్లమ ట్టి అక్రమాలపై ఎన్ని ఫిర్యాదులు అందినా పట్టించుకోని ఇరిగేషన్‌ అధికారులకు ఎంత ముట్టిందో రైతులకు జవాబు చెప్పాలన్నారు. మంగనూరు చెరువులో నల్లమట్టి అక్రమాలను ప్రశ్నించిన యువకులను అధికార పార్టీ నాయకులు వేధించడం సరికాదన్నారు. ప్రాజెక్టులకు నల్లమట్టి పేరుతో వట్టెం రిజర్వాయరును ధ్వంసం చేసి పర్యావరణానికి హాని కలిగించారన్నారు. తిమ్మాజిపేట మండల కేంద్రంలో గుట్ట మట్టిని అమ్ముకున్న ఎమ్మెల్యే దాని నుంచి వచ్చిన డబ్బులతోనే పాఠశాల నిర్మించి స్వంత నిధులతో కట్టానని  చెప్పుకుంటున్నారని ఆరోపించారు. నియోజవర్గంలో నల్లమట్టి దోపిడి దాదాపు వెయ్యి కోట్లు దాటిందని, దీనిపై విచారణ జరిపించకపోతే కోర్టుకు వెళ్తానని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు కొటయ్య, కౌన్సిలర్‌ నిజాముద్దీన్‌, సునేంద్ర, సుల్తాన్‌, నాయకులు మల్లయ్యగౌడ్‌,  తిమ్మాజిపేట పాండు, శ్రీనివాసరావుతదితరులు పాల్గొన్నారు.   

Updated Date - 2022-06-14T05:25:04+05:30 IST