Advertisement
Advertisement
Abn logo
Advertisement

లాటరీలో రూ.12కోట్లు గెలుచుకున్నానంటూ NRI ప్రకటన.. ప్రూఫ్ ఏదంటున్న జనం

దుబాయి: బతుకు దెరువు కోసం దుబాయి వెళ్లి, అక్కడ ఓ హోటల్‌లో పని చేస్తున్న కేరళ వాసికి అదృష్టం వరించింది. దీంతో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ.12 కోట్లను గెలుచుకున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ప్రకటిస్తూ సంతోషం వ్యక్తం చేశాడు. అయితే అతను ఇచ్చిన వివరణపై అనుమానం వ్యక్తం చేస్తున్న కేరళ ప్రజలు.. ఈ విషయంలో క్లారిటీ కోసం తీవ్రంగా చర్చిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. 


కేరళ ప్రభుత్వం ఓనమ్ పండుగ సందర్భంగా బంపర్ లాటరీని నిర్వహించింది. ఈ లాటరీ డ్రాకు సంబంధించిన ఫలితాలను ఆ రాష్ట్ర మంత్రులు ఆదివారం సాయంత్రం ప్రకటించారు. ఈ క్రమంలోనే రూ.12కోట్ల బంపర్ ప్రైజ్‌కు సంబంధించిన లాటరీ టికెట్ నెంబర్‌ను కూడా మంత్రులు ప్రకటించారు. దీంతో అందరి చూపు రూ.12కోట్లు గెలుచుకున్న లాటరీ టికెట్‌పైనే పడ్డాయి. ఆ లాటరీ టికెట్ ఎవరిది అన్న విషయంపై ఆరా తీయడం మొదలుపెట్టారు. సోషల్ మీడియా మొదలుకొని.. కేరళకు చెందిన ప్రధాన మీడియా సంస్థలన్నీ ఆ లాటరీ టికెట్ ఓనర్‌ను వెతికి పట్టుకునే పనిలో పడ్డాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం దుబాయిలోని ఓ హోటల్‌లో పని చేస్తున్న.. వయనాడ్‌కు చెందిన సాయెద్ ఆలవి.. సంచలన ప్రకటన చేశారు. డ్రాలో రూ.12కోట్లు గెలుచుకున్న లాటరీ టికెట్‌కు ఓనర్‌ను తానే అంటూ వెల్లడించారు. త్రిపునితురలోని మీనాక్షీ లాటరీలో తన ఫ్రెండ్ ద్వారా రూ. 300తో లాటరీ టికెట్‌ను కొనుగోలు చేసినట్లు  పేర్కొన్నారు. భారీ మొత్తంలో డబ్బులు గెలవడంపట్ల సంతోషం వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం తనకు వచ్చే 7.50కోట్ల డబ్బుతో సొంత గ్రామంలో ఓ ఇంటిని నిర్మించుకోనున్నట్లు కూడా చెప్పారు. తాను లాటరీలో డబ్బులు గెలుచుకున్నట్లు ఇంట్లో కూడా చెప్పానని.. ఇది విని కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారని తెలిపారు. 


అయితే ఆ లాటారీ టికెట్‌కు తానే ఓనర్‌ను అంటూ సాయెద్ ఆలవి చేసిన ప్రకటనను కేరళ ప్రజలు అంతగా విశ్వసించడం లేదు. వయనాడ్-త్రిపునితుర మధ్య సుమారు 280 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఫ్రెండ్ చెప్పాడని ఓ వ్యక్తి ఇంత దూరం ప్రయాణించి మరీ.. లాటరీ టికెట్‌ను కొనుగోలు చేశాడంటే ఎలా నమ్మేది అని అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా సదరు వ్యక్తి.. ఇంత వరకు మీడియా ముందుకు  కూడా రాలేదు. తన వద్ద ఉన్న లాటరీ టికెట్‌ను బయటపెట్టలేదు. అలాంటప్పుడు సాయెద్ ఆలవి చెప్పేది నిజమే అని ఎలా నమ్మడం అంటూ చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. డ్రాలో కోట్లాది రూపాయలను కొల్లగొట్టిన ఆ లాటరీ టికెట్‌కు యజమాని ఎవరన్నది ప్రస్తుతం ప్రశ్నగా మిలిగిపోయింది. 


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement