Covid Positive ఎలిమెంటరీ టీచర్.. అంతమంది చిన్నారులకు అంటించడంతో..

ABN , First Publish Date - 2021-08-30T02:53:38+05:30 IST

వ్యాక్సిన్ తీసుకోని ఓ టీచర్.. తాను చదివించే క్లాస్‌లో సగం మంది పిల్లలకు కోవిడ్ అంటించింది. ఈ ఘటన అమెరికాలోని..

Covid Positive ఎలిమెంటరీ టీచర్.. అంతమంది చిన్నారులకు అంటించడంతో..

కాలిఫోర్నియా: వ్యాక్సిన్ తీసుకోని ఓ టీచర్.. తాను చదివించే క్లాస్‌లో సగం మంది పిల్లలకు కోవిడ్ అంటించింది. ఈ ఘటన అమెరికాలోని కాలిఫోర్నియాలో చోటు చేసుకుంది. ఆమె వల్ల చిన్నారులతో కలిపి మొత్తం 26 మంది కోవిడ్ డెల్టా వేరియంట్ బారిన పడినట్లు యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) అధికారులు వెల్లడించారు. కోవిడ్ లక్షణాలు కనిపించినప్పటికీ సదరు టీచర్ రెండు రోజుల పాటు పాఠశాలకు హాజరైందని, కనీసం మాస్క్ కూడా ధరించకుండా పెద్ద పెద్దగా అరుస్తూ పాఠాలు చెప్పిందని నిపుణులు వెల్లడించారు. క్లాస్ రూంలో టీచర్‌కు దగ్గరగా కూర్చునే పిల్లలే ఎక్కువగా కోవిడ్ బారిన పడినట్టు తేలిందని చెప్పారు. ప్రస్తుతం వారందరినీ క్వారంటీన్‌లో ఉంచి చికిత్స  అందిస్తున్నట్లు తెలిపారు.


కోవిడ్ నియంత్రణలో మాస్కులు, వ్యాక్సినేషన్, ఇతర జాగ్రత్తలు ఎంత అవసరమో ఈ ఘటన తెలియజేస్తుందని నిపుణులు చెబుతున్నారు. స్కూళ్లు తెరుచుకున్న ఈ క్రమంలో వీటి అవసరం మరింత పెరిగిందని, ఇప్పటికైనా అందరూ వీటిని పాటించాలని, అలాగే ఏ మాత్రం కోవిడ్ లక్షణాలు కనిపించినా.. పాఠశాలలకు వెళ్లకుండా ఇంటివద్దనే ఉండాలని సూచించారు. అలాగే స్కూళ్లలో వ్యాక్సినేషన్ అత్యవసరం చేయాల్సిన ఆవశ్యకతను కూడా ఇది తెలియజేస్తుందని అన్నారు.

Updated Date - 2021-08-30T02:53:38+05:30 IST