Abn logo
Sep 27 2021 @ 00:14AM

40 అడుగుల బావిలో పడిన పాడి ఆవు

బావిలో పడ్డ పాడిఆవును వెలికితీస్తున్న అగ్నిమాపక సిబ్బంది

రక్షించిన అగ్నిమాపక సిబ్బంది

పలమనేరు, సెప్టెంబరు 26 : ప్రమాదవశాత్తు 40 అడుగుల బావిలో పడిన పాడి ఆవును పలమనేరు  అగ్నిమాపక సిబ్బంది వెలికి తీసి కాపాడారు. బైరెడ్డిపల్లె మండలం కుమ్మరగుంట గ్రామానికి చెందిన ఎం.కె. చలపతి అనే రైతుకు చెందిన పాడిఆవు ఆదివారం గడ్డి మేసుకుంటూ ప్రమాదవశాత్తు 40 అడుగుల లోతున్న బావిలో పడిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది  సంఘటనా స్థలానికి చేరుకుని బావిలో పడిన పాడిఆవును బయటకు తీసి కాపాడారు.