లోతట్టు ప్రాంతాల్లో రక్షణగోడ నిర్మించాలి

ABN , First Publish Date - 2021-12-01T04:49:18+05:30 IST

లోతట్టు ప్రాంతాల్లో తక్షణమే రక్షణ గోడలు నిర్మించి ప్రజల ప్రాణాలు, ఇళ్లు కాపాడాలని టీడీపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు పంతగాని నరసింహప్రసాద్‌ తెలిపారు.

లోతట్టు ప్రాంతాల్లో రక్షణగోడ నిర్మించాలి
రైల్వేకోడూరు పంచాయతీ పరిధిలోని కొత్తకోడూరు వద్ద టీడీపీ హయాంలో నిర్మించిన రక్షణ గోడను చూపిస్తున్న పంతగాని

ముఖ్యమంత్రి రైల్వేకోడూరు నియోజకవర్గంలో పర్యటించాలిఫ సాంస్కృతిక విభాగం  రాష్ట్ర అధ్యక్షుడు పంతగాని నరసింహప్రసాద్‌

రైల్వేకోడూరు, నవంబరు 30: లోతట్టు ప్రాంతాల్లో తక్షణమే రక్షణ గోడలు నిర్మించి ప్రజల ప్రాణాలు, ఇళ్లు కాపాడాలని టీడీపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు పంతగాని నరసింహప్రసాద్‌ తెలిపారు. మంగళవారం రైల్వేకోడూరు వరద ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ రైల్వేకోడూరు నియోజకవర్గంలో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకోవాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ హయాం లో కొత్తకోడూరు, సమతానగర్‌ ప్రాంతాలు, భూములు కోతకు గురికాకుండా ఉండాలని కోట్లాది రూపాయలు వ్యయంతో రక్షణ గోడలు నిర్మించారని గుర్తు చేశారు. నరసరాంపురం, ధర్మాపురం, చిన్నలాలాపేట, దొమ్మరిళ్లు, ఆర్‌టీసీ బస్తాండు, గాంధీనగర్‌ తదితర ప్రాంతాలలో నివసిస్తున్న పేద ప్రజలు ఇళ్లు గతంలో కొట్టుకునిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కురిసిన భారీ వర్షాలకు నరసరాంపురంలో కూ లిపోయాయని తెలిపారు. రైల్వేకోడూరు నియోజకవర్గంలోని పెనగలూ రు మండలంలో చాలా గ్రామాలు దెబ్బతిన్నాయన్నారు. రాజంపేట తర్వా త ముఖ్యమంత్రి రైల్వేకోడూరులో కూడా పర్యటించి పేదలను ఆదుకోవాలన్నారు. నాలుగు సార్లు గెలిచిన ఎమ్మెల్యే సొంత ఊరికి బ్రిడ్జి, రోడ్లు వేయించుకోలేని స్థితిలో ఉన్నారని తెలిపారు. అసెంబ్లీలో కూడా రక్షణ గోడ గురించి మాట్లాడలేని స్థితిలో ఎమ్మెల్యే ఉన్నారని ఆరోపించారు. పేదలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో రక్షణ గోడకు విడుదల చేసిన తర్వాత ఈ నిధుల్ని వైసీపీ అధికారంలోకి వచ్చాకా రద్దు చేసిందని ఆరోపించారు. ఎమ్మెల్యే ముఖ్యమంత్రి పక్కనే కూర్చుంటారు కదా రైల్వేకోడూరులో ఉన్న సమస్యలు చెప్పి చేయించవచ్చు అని తెలిపారు. సమస్యలు గాలికి వదిలేస్తే ఎలా అని ప్రశ్నించారు. రైల్వే అండర్‌ బ్రిడ్జి మంజూరు విషయంలో జాప్యం చేస్తున్నారని తెలిపారు. రోడ్లు అధ్వానంగా మారాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర యువ నాయకుడు బొక్కసం చలపతి, స్థానిక టీడీపీ నాయకుడు పోతురాజు నవీన్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-12-01T04:49:18+05:30 IST