రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నా, మూడుసార్లు మహిళా డాక్టర్‌కు కరోనా

ABN , First Publish Date - 2021-07-28T15:42:16+05:30 IST

మహారాష్ట్రలోని ముంబైలో కరోనాకు సంబంధించిన...

రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నా, మూడుసార్లు మహిళా డాక్టర్‌కు కరోనా

ముంబై: మహారాష్ట్రలోని ముంబైలో కరోనాకు సంబంధించిన ఆరుదైన కేసు వెలుగుచూసింది. ఒక వైద్యురాలు మూడు సార్లు కరోనా బారిన పడ్డారు. ఆమె రెండు డోసుల కరోనా టీకా తీసుకున్నప్పటికీ వైరస్ బారిన పడ్డారు. ముంబైలోని ములుండ్ ప్రాంతానికి చెందిన డాక్టర్ సృష్టి హలారీ గత ఏడాది జూన్ నుంచి ఇప్పటివరకూ మూడుసార్లు కరోనా బారినపడ్డారు. 


ఈ ఏడాది ఆమె రెండు డోసుల వ్యాక్సిన్ కూడా తీసుకున్నారు. డాక్టర్ సృష్టి హలారీ మళ్లీ కరోనా బారిన పడటంతో ఆమె శాంపిల్‌ను జినోమ్ సీక్వెన్సింగ్ కోసం సేకరించారు. ఆ మహిళా డాక్టర్ తెలిపిన వివరాల ప్రకారం తనకు మూడవసారి కరోనా రావడానికి పలు కారణాలు ఉండవచ్చని, కొత్త వేరియంట్ లేదా రిపోర్టు తప్పుగా వచ్చివుండవచ్చన్నారు. నిపుణులు ఈ ఉదంతం గురించి మాట్లాడుతూ ఈ విధంగా పలుమార్లు కరోనా సోకినవారు వైరస్ నుంచి త్వరగా కోలుకుంటారన్నారు.

Updated Date - 2021-07-28T15:42:16+05:30 IST