క్యాన్సర్‌తో పోరాడుతూ తల్లి కోసం తల్లడిల్లుతున్న పసిప్రాణం..

ABN , First Publish Date - 2021-01-20T19:10:31+05:30 IST

కన్న బిడ్డలు ఆయురోగ్యాలతో ఉంటేనే తల్లిదండ్రులకు తిన్నా, తినకున్నా కడుపు నిండుతుంది.

క్యాన్సర్‌తో పోరాడుతూ తల్లి కోసం తల్లడిల్లుతున్న పసిప్రాణం..

కన్న బిడ్డలు ఆయురోగ్యాలతో ఉంటేనే తల్లిదండ్రులకు తిన్నా, తినకున్నా కడుపు నిండుతుంది. తమ కడుపు మాడ్చుకునైనా బిడ్డల కడుపు నింపుతారు. అలాంటిది.. కన్న బిడ్డ అనారోగ్యంతో మంచానికే పరిమితమైతే, బిడ్డకు వైద్యం చేయించడానికి వారి ఆర్థిక స్థోమత సరిపోక నిస్సహాయులుగా మిగిలిపోవాల్సి వస్తే.. ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. అలాంటి గడ్డు పరిస్థితులనే హసన్ అసబ్ కుటుంబం ఎదుర్కొంటోంది. అతని ఎనిమిదేళ్ల కుమారుడు మహ్మద్‌ను మహమ్మారి క్యాన్సర్ కబళించింది. 


మిగిలిన పిల్లల్లా చలాకీగా ఆడుకోవాల్సిన వయసులో మహ్మద్ మంచానికి పరిమితం కావాల్సి వచ్చింది. ఐదేళ్ల క్రితం ఆ పిల్లాడి తల్లి కూడా ఘోర రోడ్డు ప్రమాదంలో గాయపడింది. ఆ ఘటన కారణంగా ఆమె బుద్ధి మాంద్యంతో బాధపడుతోంది. అప్పటి నుంచి మహ్మద్‌‌కు తండ్రి హసన్ అసబే ప్రపంచం. తల్లి అనారోగ్యంతో బాధపడుతుండటంతో మహ్మద్ బాల్యమంతా ఇంటి దగ్గరే గడిచిపోయింది. ఈ విషమ పరిస్థితులన్నీ ఆ కుటుంబాన్ని మరింత గడ్డు స్థితిలోకి నెట్టేశాయి. 


ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలోనే అక్టోబర్‌లో ఒకరోజు మహ్మద్ గొంతుపై వాపుతో బాధపడుతుండటాన్ని గమనించిన హసన్ అసబ్ స్థానిక క్లినిక్‌లో కొడుకుకు చికిత్స చేయించాడు. అయినప్పటికీ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోవడంతో వైద్య పరీక్షలు చేయించాడు. ఆ వైద్య పరీక్షల్లో ఓ భయంకర నిజం బయటపడింది. మహ్మద్‌కు క్యాన్సర్ సోకినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. దీంతో.. అసబ్ మరింత కుంగిపోయాడు. భార్య బుద్ధి మాంద్యం, కొడుకు క్యాన్సర్ అసబ్ జీవితాన్ని తలకిందులు చేసింది. 


మహ్మద్‌ క్యాన్సర్ చికిత్సకు సరిపడినంత డబ్బు సమకూర్చలేకపోవడం పేద రైతు అయిన అసబ్‌‌ను మరింత కుంగతీసింది. అక్టోబర్ నుంచి మహ్మద్‌కు 2 సార్లు కీమోథెరపీ చికిత్స చేశారు. అసబ్ తను జీవితంలో కూడబెట్టిన డబ్బంతా చికిత్స కోసం ఖర్చు చేసి నిస్సహాయంగా నిలిచిన పరిస్థితిలో ఉన్నాడు. తన కొడుకు మహ్మద్‌ను బతికించుకోవాలంటే అసబ్‌కు 8 లక్షల రూపాయల డబ్బు అవసరం. ఈ పేద కుటుంబం నిస్సహాయ స్థితిలో నిలిచి దాతల సాయం కోసం వేయికళ్లతో ఎదురుచూస్తోంది. 


మహ్మద్ ప్రాణాలు నిలవాలన్నా, ఈ పేద కుటుంబం కన్నీళ్లు తుడవాలన్న మీ సాయం అవసరం. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహ్మద్ ఇంట్లో ఉన్న తన తల్లిని చూడాలని రాత్రింబవళ్లు ఏడుస్తున్నాడు. ఆ పసివాడి వేదన చూసి ఆ తండ్రి హృదయం తల్లడిల్లిపోతోంది. అసబ్ తన కొడుకును కాపాడుకోవడం కోసం చేయగలిగినంతా చేశాడు. ఇక.. విషాదంలో కొట్టుమిట్టాడుతున్న క్యాన్సర్ బాధితుడు, ఆ పసివాడు మహ్మద్ ఆరోగ్యం నిలవాలంటే దయచేసి సాయం చేయండి. ఆ కుటుంబాన్ని మానవత్వంతో ఆదుకోండి.



Updated Date - 2021-01-20T19:10:31+05:30 IST