Advertisement
Advertisement
Abn logo
Advertisement

పంటల పరిస్థితిపై క్షేత్రస్థాయి అధ్యయనం చేయాలి

 పంటల పరిస్థితిపై క్షేత్రస్థాయి అధ్యయనం చేయాలి

ధరల స్థీరీకరణ సమావేశంలో ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి

కందుకూరు, డిసెంబరు 1 : వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి పంట నష్టాలను సమగ్రంగా అంచనా వేయాలని కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌ రెడ్డి కోరారు. బుధవారం సాయంత్రం స్థానిక వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌ ఆవరణలో ధరల స్థిరీకరణ, గిట్టుబాటు ధరల కల్పనపై జరిగిన నియోజక వర్గ స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు.  వర్షాలకు అన్ని రకాల పైర్లకు నష్టం వాటిల్లినందున అధికారులు క్షేత్ర స్థాయి పరిశీలనలు చేయకుంటే నిజంగా నష్టపోయిన రైతులు ఇబ్బంది పడతారని సూచించారు. కొన్నేళ్ల తరువాత కందుకూరు ప్రాంతంలో అన్ని చెరువులు సంపూర్ణంగా నిండి నందున వరి సాగుచేసే రైతులు మార్కెట్‌లో గిరాకి ఉండే రకాలనే ఎంచుకునేలా వ్యవసాయ అధికారులు ప్రత్యేక కృషి చేయాలని సూచించారు. అలాగే ఉద్యాన శాఖ ద్వారా 45 రకాల పైర్ల సాగుకు ఎన్‌ఆర్‌ఈజీఎ్‌స ప్రోత్సాహకాలు ఇస్తునప్పటికి రైతులకు కనీసం అవగాహన కల్పించడంలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరు మార్చుకోకుంటే ఇబ్బంది పడతారని హెచ్చరించారు. మార్కెటింగ్‌ శాఖ ఏడీ ఉపేంద్రకుమార్‌ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో ఈ మార్కెటింగ్‌ విధానంలో దేశంలో ఎక్కడైనా గిరాకీ ఉన్నచోట తమ పంట ఉత్పత్తులు అమ్ముకునే వెసులు బాటు రైతులకు కల్పించడం, తమకు అవసరమైన పంట ఉత్పత్తులు ఏ ప్రాంతంలో అందుబాటులో ఉన్నాయో వ్యాపారులకు తెలియచేయడం లక్ష్యాంగా మార్కెట్‌ కమిటీల ద్వారా ఒక పోర్టల్‌ను ప్రారంభిస్తున్నామని వివరించారు. మార్కెట్‌ యార్డ్‌ కమిటీ చైర్మన్‌ గణేశం శిరీషా గంగిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వైస్‌చైర్మన్‌ మేకలబోయిన శ్రీనివాసులు పాల్గొన్నారు.


Advertisement
Advertisement