Advertisement
Advertisement
Abn logo
Advertisement

ద్విచక్ర వాహనాల షోరూమ్‌లో అగ్ని ప్రమాదం

గాజువాక, డిసెంబరు 7: గాజువాకలోని సింహాద్రి హీరో ఎలక్ర్టిక్‌ షోరూమ్‌లో మంగళవారం జరిగిన అగ్ని ప్రమాదంలో 15 ద్విచక్ర వాహనాలు, రెండు కంప్యూటర్‌లు, బ్యాటరీ అగ్నికి ఆహుతయ్యాయి. పాతగాజువాక దరి పంతులుగారి మేడ ప్రాంతంలో ఉన్న సింహాద్రి హీరో ఎలక్ట్రిక్‌ షోరూమ్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ మూలంగా ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. షోరూమ్‌ సిబ్బంది సమాచారం మేరకు పెదగంట్యాడ అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. అయితే ఈ ప్రమాదంలో  షోరూమ్‌లో ఉన్న  ద్విచక్ర వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు 20 లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్టు అగ్నిమాపక శాఖ అధికారి లూఽథర్‌కింగ్‌ తెలిపారు. అదృష్టవశాత్తు  ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement
Advertisement