Abn logo
Oct 22 2021 @ 13:42PM

ముంబై : 61 అంతస్థుల భవనంలో అగ్ని ప్రమాదం

ముంబై : నగరంలోని కర్రీ రోడ్‌లో ఉన్న 61 అంతస్థుల నివాస భవనంలో శుక్రవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం సంభవించింది. అవిఘ్న పార్క్ బిల్డింగ్‌లోని 19వ అంతస్థులో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక దళాలు ప్రమాద స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు ప్రారంభించాయి. ఈ భవనంలోని ప్రజలను కాపాడేందుకు, మంటలను ఆర్పేందుకు శ్రమిస్తున్నాయి. 


సెంట్రల్ ముంబై అగ్నిమాపక శాఖ అధికారి ఒకరు తెలిపిన వివరాల ప్రకారం, అవిఘ్న పార్క్ బిల్డింగ్‌లోని 19వ అంతస్థులో శుక్రవారం మధ్యాహ్నం మంటలు చెలరేగాయి. ఈ మంటలను ఆర్పేందుకు 12 అగ్నిమాపక శకటాలు కృషి చేస్తున్నాయి. వాటర్ ట్యాంకర్లను కూడా తరలించారు. మరిన్ని వివరాలు తెలియవలసి ఉంది.