విశాఖ: దువ్వాడ సెజ్‌లో అగ్నిప్రమాదం

ABN , First Publish Date - 2021-04-11T20:35:51+05:30 IST

విశాఖ: దువ్వాడ సెజ్‌లో అగ్నిప్రమాదం జరిగింది. పూజ స్క్రాప్ పరిశ్రమలో ఈ ప్రమాదం జరిగింది.

విశాఖ: దువ్వాడ సెజ్‌లో అగ్నిప్రమాదం

విశాఖ: దువ్వాడ సెజ్‌లో అగ్నిప్రమాదం జరిగింది. పూజ స్క్రాప్ పరిశ్రమలో ఈ ప్రమాదం జరిగింది. ఈ పరిశ్రమలో ట్రాన్స్‌ఫార్మర్స్‌ను రిపేర్ చేస్తుంటారు. షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం జరిగినట్లు తెలియవచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన ప్రదేశానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. కాగా ఎలాంటి ప్రాణహానీ జరగలేదు. ప్రమాదంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Updated Date - 2021-04-11T20:35:51+05:30 IST