ఆ స్నేహం ఎందుకు?

ABN , First Publish Date - 2020-09-28T05:30:00+05:30 IST

రాము, సోము మంచి స్నేహితులు. ఒకరోజు ఇద్దరూ పొరుగూరికి బయలుదేరారు. ఆ ఊరికి వెళ్లే దారిలో చిట్టడవి ఉంటుంది. దాన్ని దాటి త్వరగా ఊరు చేరుకోవాలని, భయపడుతూనే వేగంగా నడవడం మొదలుపెట్టారు...

ఆ స్నేహం ఎందుకు?

రాము, సోము మంచి స్నేహితులు. ఒకరోజు ఇద్దరూ పొరుగూరికి బయలుదేరారు. ఆ ఊరికి వెళ్లే దారిలో చిట్టడవి ఉంటుంది. దాన్ని దాటి త్వరగా ఊరు చేరుకోవాలని, భయపడుతూనే వేగంగా నడవడం మొదలుపెట్టారు. అడవి దాటక ముందే సూర్యాస్తమయం అయింది. చీకటి పడుతుండటంతో ఇద్దరిలో భయం ఇంకా ఎక్కువయింది.


అదే సమయంలో దారిలో ఒక ఎలుగుబంటి కనిపించింది. వెంటనే రాము పరుగెత్తుకుంటూ వెళ్లి అక్కడున్న చెట్టు ఎక్కాడు. సోము కూడా చెట్టు ఎక్కాలని ప్రయత్నించాడు, కానీ ఎక్కలేకపోయాడు. ‘చేయి అందించు’ అని రాముని అడిగినా ఫలితం లేకపోయింది. దాంతో చెట్టు వెనకాలే భయం భయంగా నక్కి కూర్చున్నాడు. ఆ ఎలుగుబంటి మెల్లగా  సోము దగ్గరకు వచ్చింది. ఇక ఎలుగుబంటి చేతిలో తన ప్రాణాలు పోయినట్టేనని అనుకున్నాడు సోము. అయితే ఎలుగుబంటి సోము  దగ్గరకు వచ్చి చెవిలో ఏదో చెప్పి, తనదారిన తాను వెళ్లిపోయింది. చెట్టుపై నుంచి జరిగినదంతా చూసిన రాము కిందకు వచ్చి ‘ఎలుగుబంటి నీ చెవిలో ఏం చెప్పింది?’ అని అడిగాడు కుతూహలంగా. ‘ఆపదలో ఉన్న స్నేహితుడి గురించి ఆలోచించని వ్యక్తితో నీకు స్నేహం ఎందుకు?’ అని అంది అన్నాడు సోము. దాంతో రాము తన తప్పు తెలుసుకుని సోముని క్షమించమని అడిగాడు.

Updated Date - 2020-09-28T05:30:00+05:30 IST