Viral video: డబ్బులు తీసేందుకు వెళ్లి ATM కేంద్రంలో ఓ యువతి షాకింగ్ ప్రవర్తన.. సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు..!

ABN , First Publish Date - 2021-10-05T01:41:36+05:30 IST

డబ్బులు తీసేందుకు ఏటీఎం‌కు వెళ్లిన ఓ యువతి వింతగా ప్రవర్తించింది. అందరిలా డబ్బులు డ్రా చేస్తే అందులో కిక్కేముంది అనుకుందో లేక.. మొట్టమొదటిసారిగా ఏటీఎం‌కు వెళ్లి ఆ క్షణా

Viral video: డబ్బులు తీసేందుకు వెళ్లి ATM కేంద్రంలో ఓ యువతి షాకింగ్ ప్రవర్తన.. సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు..!

ఇంటర్నెట్ డెస్క్: డబ్బులు తీసేందుకు ఏటీఎం‌కు వెళ్లిన ఓ యువతి వింతగా ప్రవర్తించింది. అందరిలా డబ్బులు డ్రా చేస్తే అందులో కిక్కేముంది అనుకుందో లేక.. మొట్టమొదటిసారిగా ఏటీఎం‌కు వెళ్లి ఆ క్షణాలను ఎంజాయ్ చేసిందో తెలియదు కానీ ఆమె చేసిన పని ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో ఏటీఎంకు వెళ్లి ఇలా ఇంత వరకూ ఎవ్వరూ చేసుండరేమో అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..



సుమారు 20-25ఏళ్ల మధ్య వయసున్న ఓ యువతి డబ్బుటు డ్రా చేసేందుకు తాజాగా ఓ ఏటీఎం‌కు వెళ్లింది. అక్కడ ఏటీఎం మిషన్‌లో కార్డు పెట్టి.. ఆ తర్వాత పూనకం వచ్చినట్లు ప్రవర్తించింది. ప్రముఖ తెలుగు హీరో స్టైల్లో స్టెప్పులేసింది. చివరగా ఏటీఎం నుంచి డబ్బులను తీసుకుని.. కరాటే స్టైల్‌లో ఆ మిషన్‌కు నమస్కారం చెప్పి అక్కడి నుంచి నిష్క్రమించింది. కాగా.. ఆ యువతి చేష్టలకు సంబంధించిన దృశ్యాలు.. అక్కడి సీసీకెమెరాలో రికార్డు కావడంతో తాజాగా ఆ వీడియో నెట్టింట వైరల్ అయింది. దీంతో స్పందిస్తున్న నెటిజనం.. ‘ఏటీఎంలో డబ్బులను ఇలా డ్రా చేయాలా.. ఇది తెలియక ఇన్ని రోజులూ ఎంత తప్పుచేశాం’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. 




Updated Date - 2021-10-05T01:41:36+05:30 IST