ఘనంగా గౌరమ్మ పండుగ

ABN , First Publish Date - 2021-10-18T06:04:49+05:30 IST

మండలంలోని బండమీదపల్లి, భోగినేపల్లి గ్రామాల్లో గౌరమ్మ పండుగను ఆదివారం ఘనంగా జరుపుకున్నారు.

ఘనంగా గౌరమ్మ పండుగ
బండమీదపల్లిలో గౌరమ్మ విగ్రహాలను నిమజ్జనానికి తీసుకెళుతున్న మహిళలు, యువతులు



రాప్తాడు, అక్టోబరు 17: మండలంలోని బండమీదపల్లి, భోగినేపల్లి గ్రామాల్లో గౌరమ్మ పండుగను ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. దసరా పండుగ రోజు గౌరమ్మ విగ్రహాలను స్థానిక ఆలయాల్లో ఏర్పాటు చేసి మూడు రోజులు నుంచి మహిళలు, యువతులు భక్తి శ్రద్ధలతో పూజించారు. వాటిని ఆదివారం సాయంత్రం ఉరేగింపుగా తీసుకువెళ్లి స్ధానిక చెరువులో నిమజ్జనం చేశారు. ఈ  కార్యక్రమంలో బండమీదపల్లి సర్పంచ ఉమాదేవి పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-18T06:04:49+05:30 IST