Advertisement
Advertisement
Abn logo
Advertisement

6ఏళ్లుగా యువతితో ప్రేమాయణం.. పెళ్లికి అన్ని సిద్ధం చేశాక స్నేహితుడి ప్రియురాలితో యువకుడు జంప్.. ఆ తర్వాత..

ఇంటర్నెట్ డెస్క్: ఆ యువకుడు ఓ యువతిని చూసి ఇష్టపడ్డాడు. ప్రేమిస్తున్నానంటూ ఆమె చుట్టూ తిరిగాడు. దీంతో ఆ యువతి అతడి ప్రేమను అంగీకరించింది. ఈ క్రమంలో గత 6 సంవత్సరాలుగా ఆ ఇద్దరూ ప్రేమలో మునిగిపోయారు. తాజాగా వారి విషయం ఇంట్లో చెప్పారు. ఇరు కుటుంబ సభ్యులు కూడా వారి పెళ్లికి పచ్చ జెండా ఊపారు. నవంబర్ 14న ఆ ఇద్దరికీ పెళ్లి చేసేందుకు ముహూర్తం ఖరారు చేశారు. ఆహ్వాన పత్రికలను కూడా ప్రింట్ చేయించారు. అంతా సక్రమంగా జరుగుతున్న సమయంలో ఆ యువకుడు చేసిన పనికి అందరి మైండ్ బ్లాక్ అయింది. స్నేహితుడి ప్రేయసితో పారిపోవడంతో.. వధువు సహా ఇరు కుటుంబ సభ్యులు షాకయ్యారు. ఆ తర్వాత ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే వివరాల్లోకి వెళితే.. 


రాజస్థాన్‌లోని జోద్‌పూర్‌కు చెందిన బాదల్ నాయక్, ఓ అమ్మాయి గత ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. తాజాగా వారి ప్రేమ విషయాన్ని తమ తల్లిదండ్రులకు చెప్పేశారు. వారి ప్రేమకు తల్లిదండ్రులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఈ నెల 27న నిశ్చితార్థం జరిపించి, వచ్చే నెల 14న పెళ్లి మూహూర్తాన్ని ఫిక్స్ చేశారు. ఈ క్రమంలోనే బాదల్ నాయక్ ఇరు కుటంబ సభ్యులతోపాటు తన స్నేహితుడికి కూడా షాకిచ్చాడు. స్నేహితుడి ప్రేయసిని తీసుకుని పారిపోయాడు. విషయం తెలిసి వధువు స్పృహ తప్పి పడిపోయింది. ఈ క్రమంలోనే వధువు కుటుంబ సభ్యులు బాదల్ నాయక్‌పై చీటింగ్ కేసు పెట్టారు.


ఇదే సమయంలో సదరు యువతి కుటుంబ సభ్యులు కూడా తమ అమ్మాయి కనిపించడం లేదంటూ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతుండగానే.. సడన్‌గా బాదల్ నాయక్, సదరు యువతితో పోలీసు స్టేషన్‌లో ప్రత్యక్షం అయ్యాడు. సమాచారం తెలియడంతో అక్కడకు చేరుకున్న వధువు.. బాదల్ నాయక్‌ను పోలీస్ స్టేషన్‌లో చెప్పుతో కొట్టింది. ఈ క్రమంలో కలగజేసుకున్న పోలీసులు.. చర్చించుకోవడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం వెతుక్కోవాలని ఇద్దరు యువతుల కుటుంబ సభ్యులకు సూచించారు. ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement