Advertisement
Advertisement
Abn logo
Advertisement

నేనొకరిని ప్రేమించానంటూ.. పెళ్లయిన వారానికే భార్య షాకింగ్ న్యూస్.. 6 నెలల తర్వాత ఆ భర్త చేసిన పనికి బంధువులందరికీ మైండ్‌బ్లాక్..!

ఇంటర్నెట్ డెస్క్: కుటుంబ సభ్యులు చూసిన అమ్మాయి అతడికి బాగా నచ్చింది. ఆమెకు తానంటే ఇష్టమో లేదో తెలుసుకోకుండానే పెళ్లికి ఓకే చెప్పేశాడు. తల్లిదండ్రుల మాట కాదనలేక ఆమె కూడా పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఇరు కుటుంబ సభ్యులూ.. వారికి పెళ్లి చేశారు. మనసుకు నచ్చిన అమ్మాయి భార్యగా రావడంతో అతడు మురిసిపోయాడు. కానీ ఆమె మాత్రం.. దిగాలుగా ఉండటాన్ని చూసి మొదట లైట్ తీసుకున్నాడు. తల్లిదండ్రులను విడిచి వచ్చినందుకే అలా ఉందేమో అని భావించాడు. పెళ్లై వారం అయినప్పటికీ ఆమె ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేకపోవడంతో.. అతడికి సందేహం కలిగింది. విషయం ఏంటా అని ఆరా తీశాడు. దీంతో ఆమె చెప్పిన బాంబులాంటి వార్తను విని అతడు షాకయ్యాడు. తాను వేరకరిని ప్రేమించానని చెప్పడంతో అతడు నివ్వెరపోయాడు. ఆ మరుక్షణమే అతడు ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఆరు నెలల తర్వాత ఆయన చేసిన పనికి బంధువులందరూ కంగుతిన్నారు. ఇంతకూ విషయం ఏంటనే వివరాల్లోకి వెళితే..


ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన పంకజ్ అనే వ్యక్తికి అతడి కుటంబ సభ్యులు పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నారు.  పెళ్లి సంబంధాలు చూడటం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే పంకజ్.. కోమలి అనే అమ్మాయి చూశాడు. ఆమె చూడటానికి చక్కగా ఉండటంతో.. కోమలితో పెళ్లికి పంకజ్ ఓకే చెప్పేశాడు. దీంతో ఇరు కుంటుం సభ్యులు మాట్లాడుకుని, పంకజ్, కోమిలికి పెళ్లి చేశారు. అయితే పెళ్లైన తర్వాత సరిగ్గా వారం రోజులకు కోమలి ఓ బాంబు లాంటి వార్తను పంకజ్‌కు చెప్పింది. తాను మరో వ్యక్తిని ఇష్టపడ్డానని, అతడినే పెళ్లి చేసుకోవాలని భావించానని చెప్పుకొచ్చింది. కోమలి నోటి నుంచి వచ్చిన ఆ మాటలను విని పంకజ్ ఒక్కసారిగా షాకయ్యాడు. ఆ తర్వాత అతడు సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ప్రేమించిన వాడితో కోమలి పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యాడు. ఇందుకోసం సరిగ్గా ఆరు నెలలపాటు వెయిట్ చేశాడు. అనంతరం ఆమెకు చట్టప్రకారం విడాకులు ఇచ్చి, దగ్గరుండి మరీ వారి పెళ్లి జరిపించాడు. పంకజ్ చేసిన పనికి అతడి బంధువులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ప్రస్తుతం ఈ విషయం స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది. ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement