రుగ్మతలకు చెక్‌ పెట్టే తేనీరు

ABN , First Publish Date - 2021-08-31T05:30:00+05:30 IST

కొన్ని స్వల్ప రుగ్మతలకు తేనీటితో చెక్‌ చెప్పవచ్చు. ఇందుకోసం ఆయా సమస్యలను తరమగలిగే ఔషధ గుణాలున్న పదార్థాలను టీకి జోడించాలి...

రుగ్మతలకు చెక్‌ పెట్టే తేనీరు

కొన్ని స్వల్ప రుగ్మతలకు తేనీటితో చెక్‌ చెప్పవచ్చు. ఇందుకోసం ఆయా సమస్యలను తరమగలిగే ఔషధ గుణాలున్న పదార్థాలను టీకి జోడించాలి.


లెమన్‌ టీ: దగ్గు, జలుబు, కడుపు ఉబ్బరం, అజీర్తిలను పోగొట్టే లెమన్‌ టీ అధిక బరువును కూడా తగ్గిస్తుంది. వేడి నీళ్లలో నిమ్మరసం, తేనె కలిపి లెమన్‌ టీ తయారు చేసుకోవచ్చు.

జింజర్‌ టీ: ప్రీ మెన్‌స్ట్రువల్‌ సిండ్రోమ్‌, జీర్ణ సమస్యలు, నెలసరి నొప్పులు, గొంతు నొప్పిలకు విరుగుడు జింజర్‌ టీ. ఈ టీ తయారీ కోసం అల్లం తరుగును నీళ్లలో వేసి, చిన్న మంట మీద మరిగించాలి. 

టర్మరిక్‌ టీ: వాపులు, నొప్పులను తగ్గించి శరీరాన్ని శుద్ధి చేసే గుణం పసుపుతో తయారుచేసిన టీకి ఉంది. గిన్నెలో నీళ్లు పోసి, బ్లాక్‌ టీ ఆకులను వేసి, చిటికెడు పసుపు కలిపి మరిగించి, టర్మరిక్‌ టీ తయారు చేసుకోవచ్చు.


Updated Date - 2021-08-31T05:30:00+05:30 IST