మత్స్యకారుల అభివృద్ధికి పెద్దపీట

ABN , First Publish Date - 2020-08-15T10:19:14+05:30 IST

మత్స్యకారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎంపీపీ చెరు కు దీపికారెడ్డి పేర్కొన్నారు.

మత్స్యకారుల అభివృద్ధికి పెద్దపీట

భీమారం, ఆగస్టు 14 : మత్స్యకారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎంపీపీ చెరు కు దీపికారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం గొల్లవాగు ప్రాజెక్టులో రాష్ట్ర మత్స్య శాఖ ఏడీ శంకరయ్య, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు సర్వోత్తమరెడ్డి, వైస్‌ ఎంపీపీ సమ్మయ్యతో చేప పిల్లలను విడుదల చేశారు. ఎంపీపీ మాట్లాడుతూ  టీఆర్‌ఎస్‌ ప్రభు త్వం అన్ని వర్గాల ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతోందన్నారు. ముదిరాజ్‌ల సంక్షేమానికి చేప పిల్లలను వందశాతం రాయితీతో ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. సర్పంచు గద్దె రాంరెడ్డి,  మధుకర్‌,  రాజ్‌కుమార్‌,  చెరుకు భారతి, శ్రీకాంత్‌గౌడ్‌,  లక్ష్మణ్‌, రవి పాల్గొన్నారు.

 

 గోదావరిలో చేపపిల్లలు విడుదల

లక్షెట్టిపేట :లక్షెట్టిపేట పట్టణంలో శుక్రవారం ఎమ్మెల్యే దివాకర్‌రావు గోదావరి నదిలో చేప పిల్లలను వదిలారు.  మత్స్యకారుల జీవన స్థితిని అభివృద్ధిలోకి తీసుకురావాలనే ఆలోచనతో సీఎం కేసీఆర్‌ ఈ ఆలోచనకు శ్రీకారం చుట్టారన్నారు. అనేక మంది మత్స్యకారులకు చేప పిల్లల పెంప కం ద్వారా స్వయం ఉపాధి కల్పించినట్లు తెలిపా రు. మున్సిపల్‌ చైర్మన్‌ నల్మాసు కాంతయ్య, వైస్‌ చైర్మన్‌ పొడేటి శ్రీనివాస్‌ గౌడ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-15T10:19:14+05:30 IST