Abn logo
Feb 10 2020 @ 06:34AM

ఇద్దరు పిల్లలను హత్యచేసి, మెట్రో ముందు దూకి వ్యక్తి ఆత్మహత్య

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో కలకలంరేపే ఘటన చోటుచేసుకుంది. షాలీమార్‌బాగ్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి తన ఇద్దరు పిల్లలను హత్యచేసి, అతను మెట్రో ముందు దూకి ఆత్మహత్య చేసుకున్న ఉదంతం వెలుగు చూసింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం మధుర్ అనే వ్యక్తి తన కుమార్తె సమీక్ష(14), కుమారుడు శ్రేయాంశ్(6)లను ఇంటిలో గొంతునొక్కి చంపేశాక, నేరుగా మెట్రో స్టేషన్‌కు చేరుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులకు షాలీమార్‌బాగ్ నుంచి ‘మధుర్ ఒక చిన్నారిని చంపేశాడు’ అని పేర్కొంటూ ఒక ఫోన్ వచ్చింది. దీంతో పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. మధుర్ ఇంటిలో ఇద్దరు చిన్నారులు అచేతన స్థితిలో బెడ్‌పై పడివున్నారు. భార్య మార్కెట్‌కు వెళ్లిన సమయంలో మధుర్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మూడు మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. కాగా మధుర్ పనిచేస్తున్న ఫ్యాక్టరీ 6 నెలల క్రితం మూతబడటంతో అతను డిప్రషన్‌లోకి వెళ్లిపోయాడని పోలీసుల దర్యాప్తులో వెల్లడయ్యింది. ఈ నేపధ్యంలోనే మధుర్ ఈ దారుణానికి పాల్పడివుంటాడని పోలీసులు భావిస్తున్నారు. 


Advertisement
Advertisement
Advertisement