కారులో పారిపోతూ మర్మాంగాన్ని కోసుకుని పారేశాడు.. కారణం తెలిస్తే షాక్

ABN , First Publish Date - 2021-08-30T01:18:48+05:30 IST

సినిమా స్టైల్లో ఓ కార్‌ను పోలీసులు ఛేజ్ చేస్తున్నారు. ముందు కారులో వ్యక్తి పోలీసులకు అందకుండా..

కారులో పారిపోతూ మర్మాంగాన్ని కోసుకుని పారేశాడు.. కారణం తెలిస్తే షాక్

టెన్నెసీ: సినిమా స్టైల్లో ఓ కార్‌ను పోలీసులు ఛేజ్ చేస్తున్నారు. ముందు కారులో వ్యక్తి పోలీసులకు అందకుండా పారిపోతున్నాడు. పోలీసులు పట్టు వదలకుండా వెంటపడుతున్నారు. ఇంతలో ముందు పారిపోతున్న వ్యక్తి తన కారులో నుంచి ఏదో పారేశాడు. అదేంటో గమనించిన పోలీసులకు దిమ్మతిరిగినంతపనైంది. అది అతడి మర్మాంగం. చాలా సేపటి ఛేజింగ్ తరువాత అతడిని పోలీసులు పట్టుకున్న పోలీసులు.. వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే లోకకల్యాణం కోసమే తన మర్మాంగాన్ని కోసేసుకున్నానని చెప్పడంతో.. అధికారులకు మరో షాక్ తగిలినట్లైంది.


అమెరికాలోని టెన్నెసీ నగర హైవే పెట్రోల్(టీహెచ్‌పీ) అధికారి బాబీ జాన్సన్ తెలిపిన వివరాల ప్రకారం.. టైసన్ గిల్బర్ట్ అనే 39 ఏళ్ల వ్యక్తి టెన్నెసీలోని డోవెల్‌టౌన్ ప్రాంతంలోని ఓ హైవేలో బుధవారం తన కారును పార్క్ చేశారు. కారును కొంత రోడ్డు మీదుగా నిలిపి ఉంచాడు. ఇది చూసిన హైవే పెట్రోల్ అధికారులు అతడి కారుకు ఫైన్ వేసేందుకు సిగ్నల్ ఇస్తూ సమీపించారు. ఇంతలో కారులో ఉన్న గిల్‌బర్ట్ కారులో పారిపోయేందుకు ప్రయత్నించాడు. అనేక సందులు, గొందులు తిరుగుతూ పోలీసులను ముప్పు తిప్పలు పెట్టాడు. అయితే డోవెల్‌‌టౌన్ నుంచి లెబనాన్ కౌంటీకి వెళ్లే దారి మధ్యలో అతడిని పట్టుకున్నారు. కారులో వెళుతూనే తన మర్మాంగాన్ని కోసేసిన గిల్బర్ట్.. ఓ మలుపు వద్ద కారును స్లో చేస్తూ తలుపు తెరిచి దానిని పారేశాడు. డోర్‌ తెరుచుకున్న క్షణంలో అతడి పరిస్థితి చూసిన పోలీసులు మైండ్ బ్లాంక్ అయింది.


కారులో అతడు పూర్తిగా నగ్నంగా ఉన్నాడు. శరీరమంతా రక్తంతో నిండిపోయి దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాడు. ఎట్టకేలకు కారు వెళ్లే దారిలో స్పైక్స్(ఇనుప ముళ్ల కంచె) వేసి కారు టైర్లు పేల్చేశారు. ముందు టైర్ పేలినా.. గిల్‌బర్ట్ కారును అలాగే ముందుకు పోనిచ్చాడు. కానీ కొంత దూరం వెళ్లేసరికి కారు నెమ్మదించి ముందుకు కదిలేందుకు మొరాయించడంతో చివరికి పోలీసులకు గిల్బర్ట్ దొరికిపోయాడు. పోలీసులు అతడిని వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. 

Updated Date - 2021-08-30T01:18:48+05:30 IST