Advertisement
Advertisement
Abn logo
Advertisement

దారుణం.. కోడలు బాత్రూంలో స్నానం చేస్తుండగా.. ఆ వృద్ధుడు..

ఇంటర్నెట్ డెస్క్: ఆమెకు సుమారు 50ఏళ్లు. పెళ్లీడు కొచ్చిన కూతురు కూడా ఉంది. ఈ క్రమంలోనే ఆమె భర్తను కోల్పోయింది. దీంతో అత్తారింట్లోనే కన్న కూతురుని చదవించికుంటూ కాలం వెల్లదీస్తుంది. ఈ క్రమంలో ఆమెకు ఓ షాకింగ్ విషయం తెలిసింది. కోడలునని కూడా చూడకుండా తన మామ(భర్త తండ్రి) దారుణానికి పాల్పడ్డట్లు తెలుసుకుని షాకైంది. అనంతరం ఆమె కీలక నిర్ణయం తీసుకుంది. కాగా.. ఇంతకూ ఏం జరిగింది అనే పూర్తి వివరాల్లోకి వెళితే.. 


రాజస్థాన్‌‌లోని జైపూర్‌కు చెందిన ఓ మహిళ కొన్నేళ్ల క్రితం ఓ వ్యక్తిని పెళ్లాడింది. వారికి ఓ అమ్మాయి కూడా జన్మించింది. కూతురుకు పెళ్లీడు వయసు వచ్చిన తర్వాత.. తాజాగా అతడు కన్నుమూశాడు. దీంతో ఒంటరైన ఆమె.. కూతురును చూసుకుంటూ అత్తారింట్లోనే ఉంటోంది. భర్త దూరమైన విషయాన్ని ఇంకా జీర్ణించుకోకుముందే.. మామ నుంచి ఆమెకు వేధింపులు మొదలయ్యాయి. ‘నువ్వు మంత్రగత్తెవు.. నా ఇంటి నుంచి వెళ్లిపో’ ఆమెను ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశాడు. అయితే దానికి ఒప్పుకోకపోవడంతో.. అతడు మరింత రెచ్చిపోయాడు. 


తాజాగా.. ఓ పిడుగు లాంటి వార్త ఆమె చెవిన వేశాడు. ‘నువ్వు, నీ కూతురు స్నానం చేస్తుంటే రహస్యంగా వీడియో తీశాను. నువ్వు ఇల్లు వదిలి వెళ్లిపోకపోతే వాటిని సోషల్ మీడియాలో పెడతాను’ అంటూ ఆమెను బెదిరించాడు. దీంతో ఆమె కంగుతింది. తన బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక కన్నీరుమున్నీరైంది. చివరికి పోలీసులను ఆశ్రయించింది. అత్తారింట్లో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పోలీసుకుల వివరించింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement