సముద్రంలో యువకుడి గల్లంతు
ABN , First Publish Date - 2021-10-22T05:54:51+05:30 IST
సముద్రంలో మునిగిపోతున్న చెల్లెళ్లను రక్షించే ప్రయత్నంలో ఒక యువకుడు గల్లంతయ్యాడు.
కాట్రేనికోన, అక్టోబరు 21: సముద్రంలో మునిగిపోతున్న చెల్లెళ్లను రక్షించే ప్రయత్నంలో ఒక యువకుడు గల్లంతయ్యాడు. గచ్చకాయలపొరకు చెందిన మల్లాడి బాలయేసు(18) తన ముగ్గురు చెల్లెళ్లతో కలిసి గురువారం సమీపంలోని చిర్రయానాం బీచ్‌కు విహారానికి వెళ్లాడు. సముద్ర స్నానాలు చేసే సమయంలో ముగ్గురు చెల్లెళ్లు అలలకు కొట్టుకుపోతుండగా వారిని రక్షించేందుకు బాలయేసు ప్రయత్నిస్తూ గల్లంతయ్యాడు. సమీపంలోని మత్స్యకారులు ముగ్గురు బాలికలను రక్షించి ఒడ్డుకు చేర్చారు. బాలయేసు ఆచూకీ లభించలేదు. ముమ్మిడివరం సీఐ జానకీరామ్ అక్కడకు చేరుకుని గాలింపు చర్యలు పర్యవేక్షిస్తున్నారు.