గుడిలో ప్రేమ పెళ్లి.. వరుడి ప్రవర్తనపై ఆలయ సిబ్బందికి డౌట్.. పట్టుకుని ఆరా తీస్తే అతను చెప్పింది విని..

ABN , First Publish Date - 2021-12-16T22:41:21+05:30 IST

వారిద్దరూ ప్రేమించుకున్నారు.. గుడిలో పెళ్లి చేసుకోవాలనుకున్నారు.. ఉజ్జయిని వెళ్లి హిందూ సామూహిక వివాహ కార్యక్రమంలో పాల్గొన్నారు.

గుడిలో ప్రేమ పెళ్లి.. వరుడి ప్రవర్తనపై ఆలయ సిబ్బందికి డౌట్.. పట్టుకుని ఆరా తీస్తే అతను చెప్పింది విని..

వారిద్దరూ ప్రేమించుకున్నారు.. గుడిలో పెళ్లి చేసుకోవాలనుకున్నారు.. ఉజ్జయిని వెళ్లి హిందూ సామూహిక వివాహ కార్యక్రమంలో పాల్గొన్నారు.. అయితే అక్కడ వరుడి ప్రవర్తన చూసి ఆలయ సిబ్బందికి అనుమానం వచ్చింది.. అతడిని ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది.. అతను ముస్లిం మతానికి చెందిన వ్యక్తి.. తప్పుడు ఆధార్ కార్డుతో అతను గుడిలోకి ప్రవేశించి ఆ కార్యక్రమంలో పాల్గొన్నాడు.. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు.. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఈ ఘటన జరిగింది. 


కర్ణాటకకు చెందిన మహ్మద్ యూనస్ అనే వ్యక్తి ఖుష్బూ యాదవ్ అనే యువతితో ప్రేమలో పడ్డాడు. వీరిద్దరూ సామూహిక వివాహ కార్యక్రమంలో పాల్గొని పెళ్లి చేసుకునేందుకు సోమవారం ఉజ్జయిని వచ్చారు. యూనస్ తన స్నేహితుడు అభిషేక్ ఆధార్ కార్డు తీసుకుని మహంకాళి గుడిలోకి ప్రవేశించాడు. పూజా కార్యక్రమంలో పాల్గొన్నాడు. అయితే ముస్లిం అయిన యూనస్ హిందూ సాంప్రదాయ పద్ధతిలో పూజ చేయలేకపోయాడు. అతని అవస్థను గమనించిన ఆలయ సిబ్బందికి అనుమానం వచ్చింది. 


అతనిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే అసలు విషయం బయటపడింది. తప్పుడు ఆధార్ కార్డుతో ఆ పూజలో పాల్గొన్నట్టు తేలింది. దీంతో ఆలయ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఖూష్బూ తల్లిదండ్రులను ఉజ్జయినికి పిలిపించారు. ఖుష్బూను ఆమె తల్లిదండ్రులు గురువారం ముంబై తీసుకెళ్లిపోయారు. యూనస్‌ను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. 

Updated Date - 2021-12-16T22:41:21+05:30 IST