ఎంత అదృష్టవంతుడో..! 2 దశాబ్దాల తర్వాత.. అతడి ఇంట్లో మళ్లీ కాసుల వర్షం..!

ABN , First Publish Date - 2021-12-17T00:38:11+05:30 IST

సాధారణంగా అదృష్టం ఒకేసారి తలుపు తడుతుంది అంటారు. కానీ ఓ వ్యక్తి విషయంలో అది తప్పైంది. దీంతో అతడి ఇంట్లో కాసుల వర్షం కురిసింది. ఈ క్రమంలో అతడి ఆనందానికి అవధుల్లే

ఎంత అదృష్టవంతుడో..! 2 దశాబ్దాల తర్వాత.. అతడి ఇంట్లో మళ్లీ కాసుల వర్షం..!

ఎన్నారై డెస్క్: సాధారణంగా అదృష్టం ఒకేసారి తలుపు తడుతుంది అంటారు. కానీ ఓ వ్యక్తి విషయంలో అది తప్పైంది. దీంతో అతడి ఇంట్లో కాసుల వర్షం కురిసింది. ఈ క్రమంలో అతడి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇంతకూ ఆయన ఎవరు? అతడి ఇంట్లో కాసుల వర్షం ఎందుకు కురిసింది అనే పూర్తి వివరాల్లోకి వెళితే..



అమెరికాకు చెందిన ఆల్విన్ కోప్‌లాండ్ అనే వ్యక్తి 2002లో ఓ లాటరీ టికెట్‌ను కొనుగోలు చేశాడు. ఆ లాటరీ టికెట్‌తో అప్పట్లో ఆయన లక్ష డాలర్లు (ఇండియన్ కరెన్సీలో రూ.76 లక్షలు) గెలుచుకుని లక్షాధికారి అయ్యాడు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఆయనను మరోసారి అదృష్టం వరించింది. ఈ సారి జాక్‌పాట్ తగలడంతో ఏకంగా కోటీశ్వరుడయ్యాడు. 7 ఎలెవన్ స్టోర్‌లో ఆల్విన్ కొనుగోలు చేసిన వర్జీనియా లాటరీకి.. డిసెంబర్ 4న తీసిన డ్రాలో 1 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 7.6 కోట్లు) తగిలాయి. దీంతో ఆయన ఇంట్లో కాసుల వర్షం కురిసింది. ఈ క్రమంలో స్పందించిన ఆయన.. సంతోషం వ్యక్తం చేశారు. 




Updated Date - 2021-12-17T00:38:11+05:30 IST