కొండగ ట్టులో నిరాడంబరంగా గోదారంగనాయకుల కళ్యాణం

ABN , First Publish Date - 2022-01-15T05:58:55+05:30 IST

ధనుర్మాసోత్సవాల్లో భాగంగా ప్రముఖ పుణ్య క్షేత్రం కొండగ ట్టు శ్రీ ఆంజనేయస్వామి సన్నిఽధిలో శుక్రవారం గోదారంగ నాథుల కల్యాణ మహోత్సవాన్ని నిరాడంబరంగా నిర్వహించారు.

కొండగ ట్టులో నిరాడంబరంగా గోదారంగనాయకుల కళ్యాణం
కొండగట్టులో కళ్యాణం నిర్వహిస్తున్న అర్చకులు

మల్యాల, జనవరి 14: ధనుర్మాసోత్సవాల్లో భాగంగా ప్రముఖ పుణ్య క్షేత్రం కొండగ ట్టు శ్రీ ఆంజనేయస్వామి సన్నిఽధిలో శుక్రవారం గోదారంగ నాథుల కల్యాణ మహోత్సవాన్ని నిరాడంబరంగా నిర్వహించారు. కొవిడ్‌ నిభందనల మేరకు భక్తులే లేకుండానే ప్రత్యేకించి అలంకరించిన వేదిక పై ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా వేదమంత్రోచ్ఛారణలు మద్య కల్యా ణాన్ని ఆలయ అర్చకులు, వేదపండితులు వైభవంగా జరిపారు. ఈ కా ర్యక్రమంలో ఈఓ వెంకటేశ్‌, ఏఈఓ శ్రీనివాస్‌, పర్యవేక్షకులు సునీల్‌ ఆ లయ ప్రధానర్చకులు రామకృష్ణ, రంగన్న చి రంజీవి, కపీంధర్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు రాజే శ్వర్‌రావు, సంపత్‌ పాల్గొన్నారు. 

కొడిమ్యాల : పూడూర్‌ గ్రామంలోని వేంక టేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో శుక్రవా రం గోదారంగ నాథుల స్వామి కల్యాణం వైభ వంగా జరిగింది. అంతక ముందు స్వామి వా రికి ప్రత్యేక పూజలు, పల్లకీ సేవ, అన్నదానం కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్ర మంలో గ్రామ సర్పంచు కవిత రవికుమార్‌, మాజీ సర్పంచు రాంరెడ్డ్డి, ఆలయ అధ్యక్షుడు వేముల రాజమల్లయ్య, పద్మశాలీ సంఘం  అధ్యక్షుడు నారాయణ, గ్రామ ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు.

రాయికల్‌ : మండలంలోని అల్లీపూర్‌ గ్రామంలోగల శ్రీలక్ష్మీ వెంకటే శ్వర స్వామి దేవాలయంలో శుక్రవారం గోదా రంగ నాయకుల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. వేదపండితుల మంత్రోఛ్చరణల మధ్య కళ్యాణం కన్నుల పండువగా నిర్వహించారు. ఈకార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ బాలె శోభారాణి చంద్రశేఖర్‌, సభ్యులు మిట్టపెల్లి అజిత్‌ రావు, మహిళలు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-15T05:58:55+05:30 IST