సాంఘిక బహిష్కరణపై కదిలిన యంత్రాంగం

ABN , First Publish Date - 2020-08-05T11:36:55+05:30 IST

కొత్తపట్నం మండలం ఈతముక్కల పల్లెపాలెంలో ఒక కుటుంబాన్ని సాంఘిక బహిష్కరణ చేసిన సంఘటనపై యంత్రాంగం ..

సాంఘిక బహిష్కరణపై కదిలిన యంత్రాంగం

కాపులతో చర్చించిన పోలీసు, రెవెన్యూ అధికారులు


కొత్తపట్నం, ఆగస్టు 4: కొత్తపట్నం మండలం ఈతముక్కల పల్లెపాలెంలో ఒక కుటుంబాన్ని సాంఘిక బహిష్కరణ చేసిన  సంఘటనపై యంత్రాంగం కదిలింది. ఒంగోలు టూటౌన్‌ సీఐ రాజేష్‌, కొత్తపట్నం తహసీల్దార్‌ పుల్లారావు, ఎంపీడీవో సుజాత, కొత్తపట్నం ఎస్‌ఐ శ్రీనివాసరావులు పల్లెపాలెం గ్రామాన్ని సందర్శించారు.కాపులు బహిష్కరించిన నాయుడు బ్రహ్మయ్యతో మాట్లాడారు. నాయుడు బ్రహ్మ య్య కుమారుడి వివాహం ఈ నెల 5వ తేదీన జరగనుండగా సాంఘిక బహిష్కరణ చేస్తూ కాపులు గ్రామంలో చాటింపు వేసిన విషయం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైంది. దీంతో అధికారులు మంగళవారం గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసి కాపులతో చర్చించారు. సాంఘిక బహిష్కరణ చట్టరీత్యానేరమని చెప్పారు. నాయుడు బ్రహ్మ య్య కుటుంబంలో కలిసిమెలిసి ఉండాలని కోరారు. దీనికి కాపులు, గ్రామస్థులు సమ్మతించారు. నాయుడు బ్రహ్మయ్యతో పాటు గతంలో సాంఘిక బహిష్కరణ చేసి రెండు కుటుంబాలతో కూడా కలిసి మెలిసి ఉండాలని కోరగా వారు అంగీకరించారు.

Updated Date - 2020-08-05T11:36:55+05:30 IST