Abn logo
Mar 1 2021 @ 23:24PM

‘ఉపాధి’లో కొత్తరకం దోపిడీ

సొంత డబ్బులతో రోడ్డు వేసుకున్న రైతులు 

ఉపాధిహామీ ద్వారా చేపట్టినట్టు రికార్డులు..

రూ. 21 లక్షల స్వాహా

పెద్ద కొడప్‌గల్‌ మండలం వడ్లం గ్రామంలో ఉపాధి అధికారుల నిర్వాకం

పెద్దకొడప్‌గల్‌, మార్చి1: పెద్దకొ డప్‌గల్‌ మండలం వడ్లం గ్రామ రై తులు పండించిన ధాన్యాన్ని ఇంటి కి తీసుకెళ్లాలంటే అనేక ఇబ్బందు లు పడ్డారు. ఉపాధి హామీ ద్వారా రోడ్డు వేయాలని రైతులు అధికారు లకు పలుమార్లు విన్నవించుకున్నా పట్టించుకోలేదు. ఇక తప్పదని భా వించి రైతులందరూ తలా కొంత భూమి రోడ్డు కోసం భూమి, ఎకరా ల వారీగా రూ.5వేల నుంచి 10వేలు ఇలా 105 మంది రైతులు డబ్బులు జమ చేసి మూడు రోడ్ల కు సుమారు రూ.7లక్షలతో రోడ్డు వేసుకున్నాన్నారు. దీన్ని గమనించి కొందరు స్థానికులు కొత్తరకం దోపిడీకి తెరతీశారు. రైతు లు వేసుకున్న రోడ్డును ఉపాధిహామీ ద్వారా చేప ట్టినట్టు రికార్డులు సృష్టించి రూ.21లక్షల 60 వేల 79 స్వాహా చేశారని, ఎవరికీ అనుమానం రాకు ండా అధికారులతో కుమ్మక్కై బిల్లులు కూడా స్వాహా చేశారని రైతులు ఆరోపిస్తున్నారు.

బోర్డుల ఏర్పాటుతో నిధులు స్వాహా..

ఉపాధిహామీలో పనులు పూర్తయ్యాయక ఆ పనికి సంబంధించిన నిధులకు వినియోగం పని చేసిన ప్రదేశం వివరాలతో కూడిన బోర్డును ఏర్పాటు చేస్తారు. రైతులు వేసుకున్న రోడ్డులకు ఉపాధిహామీ నిధులు వినియోగించినట్లు బోర్డు ల ఏర్పాటు చేయడంతో రైతులు ఆశ్చర్యపోయారు. దాదాపు రూ.7లక్షలు ఖర్చు చేసి రోడ్లు ఏర్పాటు చేసుకుంటే ఉపాధి హామీలో రోడ్లు వేసి నట్లు బోర్డులను ఏర్పాటు చే యడంతో రైతులు విస్మయానికి గురయ్యారు. ఇందులో స్థానిక నాయకుల హస్తం ఉందని, స్థానిక సర్పంచ్‌ సన్నిహితులు అధికారులతో కు మ్మక్కై నిధులు స్వాహా చేశారని రైతులు అను మానం వ్యక్తం చేస్తున్నారు. 

రైతులు వేసిన రోడ్లు..

ఆర్‌ అండ్‌  బీ రోడ్డు నుంచి యశ్వంత్‌ రావు చేను వరకు రైతులు అంతా కలిసి రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు డబ్బులు జమ చేసి 4 లక్షలతో రోడ్డు ఏర్పాటు చేశారు. కానీ ఈ రోడ్డును ఉపాధిహామీలో చేపట్టినట్టు రెండు భాగాలుగా చేసినట్లు రికార్డులు సృష్టించి 16లక్షల 39వేల 531 రూపా యలు స్వాహా చేశారు. ఈ రో డ్డుకు గ్రామానికి చెందిన రైతు పండిత్‌రావు 70వేల రూపా యలు ఇవ్వగా, గులాబ్‌ రావు వం ద ట్రాక్టర్ల మట్టిని ఇచ్చారు. మరో రోడ్డుకు అలుగు కట్ట నుంచి బస్వ న్న కుచ్చ వరకు 2లక్షల రూపాయ లతో రైతులు రోడ్డు ఏర్పాటు చేశారు. దీన్ని ఉపాధిహామీ పేరుతో 5 లక్షల 10 వేల 851 రూపాయలు దుర్వినియోగం చేశారు. మరో రోడ్డుకు ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి గులాబ్‌ రావు పొలం వరకు రూ.లక్ష ఖర్చు చేయగా, దీని పై ఉపాధిహామీ నిధులు 9లక్షలకు పైగా ఖర్చు చేసినట్లు రికార్డులు సృష్టించి డబ్బులు స్వాఽహా చే శారని రైతులంటున్నారు. దీనిపై జిల్లా అధికారు లు స్పందించాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

విచారణ జరుపుతాం..

శ్రీనివాస్‌, ఎంపీడీవో, పెద్దకొడప్‌గల్‌

వడ్లం గ్రామ రైతులు సొంత ఖర్చుతో రోడ్డు నిర్మిం చుకున్నామని చెప్తున్నారు. రోడ్డు చేపట్టకుండానే ఉపా ధిహామీ ద్వారా చేసినట్లు రికార్డులు సృష్టించి నిధు లు దుర్వినియోగం చేశారని రైతులు ఫిర్యాదు చేశారు. రైతుల ఫిర్యాదు మేరకు దీనిపై విచారణ జరుగుతుం ది. నిధులు దుర్వినియోగం చేసిన వారు ఎవరైనా కఠిన చర్యలు తీసుకుంటాం.

Advertisement
Advertisement