ఉష్ణోగ్రతను తగ్గించే సూపర్ వైట్ పెయింట్‌ను తయారు చేసిన శాస్త్రవేత్తలు

ABN , First Publish Date - 2020-10-25T17:41:06+05:30 IST

పర్‌డ్యూ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు సరికొత్త సూపర్ వైట్

ఉష్ణోగ్రతను తగ్గించే సూపర్ వైట్ పెయింట్‌ను తయారు చేసిన శాస్త్రవేత్తలు

న్యూఢిల్లీ : పర్‌డ్యూ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు సరికొత్త సూపర్ వైట్ పెయింట్‌ను తయారు చేశారు. ఇది సూర్యరశ్మి నిరోధకంగా పని చేస్తుందని, దీనిని వాడిన భవనాల్లో ఉష్ణోగ్రత బయటి వాతావరణం కన్నా తక్కువగా ఉంటుందని చెప్పారు. రాబోయే రోజుల్లో ఎయిర్ కండిషనర్లకు బదులుగా ఈ పెయింట్ ఉపయోగపడే అవకాశం ఉందన్నారు. 


కాల్షియం కార్బొనేట్ ఫిల్లర్స్‌ను ఉపయోగించి ఈ సూపర్ వైట్ పెయింట్‌ను తయారు చేసినట్లు తెలిపారు. ఈ పెయింట్‌ వేసిన భవనాల్లో బయటి వాతావరణంతో పోల్చితే రాత్రి వేళల్లో 10 డిగ్రీల సెల్సియస్, పగటి వేళల్లో 1.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు తగ్గుతాయని చెప్పారు. భవనాలను చల్లగా ఉంచేందుకు ఈ పెయింట్ ఉపయోగపడుతుందన్నారు. వేడిని నిరోధించే ఇతర పెయింట్స్ కేవలం 80 నుంచి 90 శాతం సూర్య రశ్మిని మాత్రమే నిరోధించగలవని, ఈ సూపర్ పెయింట్ 95.5 శాతం సూర్య రశ్మిని నిరోధించగలదని వివరించారు. 


తాము తయారు చేసిన సూపర్ వైట్ పెయింట్‌లో టైటానియం డయాక్సైడ్ పార్టికల్స్‌‌కు బదులుగా కాల్షియం కార్బొనేట్ ఫిల్లర్స్‌ను వాడామని చెప్పారు. దీనివల్ల ఈ పెయింట్ శోషించుకునే అల్ట్రావయొలెట్ లైట్ తగ్గుతుందని వివరించారు. సహజంగా భవనాలను చల్లగా ఉంచేందుకు ఈ కొత్త పెయింట్ ఉపయోగపడుతుందన్నారు. 


Updated Date - 2020-10-25T17:41:06+05:30 IST