ప్రధాన పంట కాలువలో వృద్ధురాలు

ABN , First Publish Date - 2021-10-22T05:52:25+05:30 IST

ప్రధాన పంటకాలువలో చెట్టు కొమ్మను పట్టుకుని కేకలు వేస్తున్న వృద్ధురాలిని స్థానికులు రక్షించారు.

ప్రధాన పంట కాలువలో వృద్ధురాలు

-రక్షించిన స్థానికులు

పి.గన్నవరం, అక్టోబరు 21: ప్రధాన పంటకాలువలో చెట్టు కొమ్మను పట్టుకుని కేకలు వేస్తున్న వృద్ధురాలిని స్థానికులు రక్షించారు.  పశ్చిమగోదావరి జిల్లా కాజాగొంది గ్రామానికి చెందిన వర్దనపు సంతోష్‌కుమారి కొంతకాలంగా మలికిపురం మండలంలో ఉన్న అనాధ ఆశ్రమంలో ఉం టోంది. ఆమెకు కుమార్తె ఈద మౌనిక, అల్లుడు జోషప్‌ ఉన్నారు. తన అల్లుడు జోషప్‌ కందాలపాలెం చర్చిలో ప్రార్థనలు చేయిస్తానని నమ్మించి మలికిపురం నుంచి ద్యిచక్రవాహనంపై తీసుకొచ్చాడని, మార్గం మధ్యలో రెండు చోట్ల అపాడని చివరగా మూడో చోట రోడ్డుపై నిలిచి ఉన్నానని, ఎలా కాలువలో పడ్డానో తెలియదని ఆమె చెప్పినట్లు స్థానికులు వివరించారు. కాగా గురువారం నాగుల్లంక శివారు గుడ్డాయిలంక వద్ద ప్రధాన పంటకాలువలో ఒడ్డున ఉన్న చెట్టు కొమ్మను పట్టుకుని కేకలు వేయడంతో అవతలి వైపు ఏటిగట్టున ఉన్న పలువురు యువకులు వృద్ధురాలిని రక్షిం చారు. సర్పంచ్‌ భర్త పెద్దిరాజుకు సమాచారం ఇచ్చారు.  కుటుంబసభ్యులకు అప్పగిస్తానని సర్పంచ్‌ తెలిపారు. 



Updated Date - 2021-10-22T05:52:25+05:30 IST