Abn logo
Jun 24 2021 @ 02:51AM

ఒక్కరోజులో పదంతస్తుల భవనం!

పదంతస్తుల భవనం నిర్మించాలంటే ఏడాదికిపైనే సమయం పడుతుంది. కానీ చైనాలో 28 గంటల 45 నిమిషాల్లో నిర్మాణం పూర్తి చేశారు. అదెలా సాధ్యమైంది అంటారా? ఇదిగో ఇలా....


టన్నుల కొద్దీ స్టీలు, ఇసుక, సిమెంటును ఉపయోగించి, రోజూ పదుల సంఖ్యలో కార్మికులు పనిచేస్తే పదంతస్తుల బిల్డింగ్‌ పూర్తికావడానికి ఏడాదికి పైనే పడుతుంది. కానీ చైనాలోని చాంగ్షా సిటీలో పదంతస్తుల అపార్టుమెంట్‌ బిల్డింగ్‌ను 28 గంటల 45 నిమిషాల్లో పూర్తి చేశారు.


ఇంత తక్కువ సమయంలో ఒక బహుళ అంతస్తుల భవనం నిర్మించడం సాధారణ విషయం కాదు. ఈ లివింగ్‌ బిల్డింగ్‌ కాన్సెప్ట్‌ను బ్రాడ్‌గ్రూప్‌ అనే సంస్థ డెవలప్‌ చేసింది.


బ్రాడ్‌గ్రూప్‌ సంస్థకు స్థానికంగా ఉన్న కంపెనీలో కాంపొనెంట్స్‌ను తయారుచేశారు. తరువాత ట్రక్‌ల సహాయంతో వాటిని నిర్మాణ ప్రదేశానికి తరలించారు. మూడు భారీ క్రేన్ల సహాయంతో వాటిని అమర్చుకుంటూ వెళ్లారు. ఆ వెంటనే ఎలక్ట్రికల్‌, ప్లంబింగ్‌ పనులను పూర్తి చేశారు. 


కార్ల తయారీలో ఉపయోగించే కాన్సెప్ట్‌ను భవన నిర్మాణంలో ఉపయోగించారు.  భవన నిర్మాణం ఒక్కరోజులో ఎలా పూర్తయిందో వీడియోను ఆన్‌లైన్‌లో పంచుకుంది ఆ సంస్థ. ఆ వీడియోను చూసిన నెటిజన్లు కొత్త టెక్నాలజీకి హ్యాట్సాఫ్‌ అంటున్నారు.