కృష్ణానది యాజమాన్య బోర్డు చైర్మన్‌గా ఏ.పరమేశం

ABN , First Publish Date - 2020-05-31T16:53:21+05:30 IST

కృష్ణానది యాజమాన్య బోర్డు చైర్మన్‌గా ఏ.పరమేశంను నియమిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.

కృష్ణానది యాజమాన్య బోర్డు చైర్మన్‌గా ఏ.పరమేశం

హైదరాబాద్‌: కృష్ణానది యాజమాన్య బోర్డు చైర్మన్‌గా ఏ.పరమేశంను నియమిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ ఆదేశాలు తక్షణమే అమలులోకి వస్తాయని ప్రకటించింది. పూర్తి స్థాయిలో ఛైర్మన్‌ను నియమించాలని కేంద్రజలశక్తిశాఖ నిర్ణయించింది. ఇప్పటివరకు కేఆర్ఎంబీకి ఛైర్మన్ లేరు. గతంలో ఉన్న ఛైర్మన్ వెళ్లిపోయిన తర్వాత గోదావరి రివర్ బోర్డు ఛైర్మన్‌ బాధ్యతలను చంద్రశేఖర్ అయ్యర్‌కు అప్పగించారు. 


అయితే తెలుగు రాష్ట్రాల మధ్య తాజాగా కృష్ణా జలాలకు సంబంధించి వివాదం తలెత్తింది. ప్రధానంగా పోతిరెడ్డిపాడు, 203 జీవో అంశంపై వివాదాలు తలెత్తిన నేపథ్యంలో రెండు రాష్ట్రాలు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నాయి. దీనిపై స్పందించిన కేంద్రం త్వరలోనే ఆపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తానని చెప్పింది. ఈ నేపథ్యంలోనే కృష్ణా బోర్డు మెంబర్ సెక్రటరీగా ఉన్న పరమేశంను ఛైర్మన్‌గా కేంద్రజలశక్తిశాఖ నియమించింది. ఈయన ఆధ్వర్యంలో ఈ నెల 4న బోర్డు సమావేశం జరగనుంది.

Updated Date - 2020-05-31T16:53:21+05:30 IST