Abn logo
Mar 2 2021 @ 00:19AM

చిన్నారుల దత్తత స్వీకారం


కొవ్వూరు మార్చి 1 : అనాథలైన ముగ్గురు చిన్నారులను పట్టణానికి చెంది న జీకే స్టడీ సెంటర్‌ డైరెక్టర్‌ గెల్లా కేశవ దత్తత తీసుకున్నారు. కొవ్వూరు రాజీవ్‌ కాలనీకి చెందిన సూరాడ శ్రీను, ఆయన భార్య భవాని ఇద్దరూ ఇటీవల మృతి చెందారు. వారి ముగ్గురి పిల్లల ను  కేశవ సోమవారం దత్తత తీసుకున్నారు. వారి చదువుకు పూర్తి బాధ్య త వహిస్తానని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.  బీజేపీ పట్టణ అధ్యక్షుడు ముత్యాలరావు  తదితరులు కేశవను అభినందించారు.

================

 పింఛన్‌ కోసం  వస్తూ అనంతలోకాలకు..

నల్లజర్ల, మార్చి  1: తెలికిచర్ల గ్రామానికి చెందిన బొడిగిన కనకమ్మ (80) నల్లజర్లలో తన కుమార్తె వద్ద ఉంటోంది. 1వ తేదీ కావడంతో  పింఛన్‌ తీసుకునేందుకు స్వగ్రామం తెలికిచర్ల  మనవడు శ్రీనివాస్‌  బైక్‌ పై బయలుదేరింది. అనంతపల్లి బైపాస్‌ రోడ్డులో హైస్కూల్‌ వద్ద వీరి బైక్‌ను వెనుక నుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో ఈమెకు తీవ్ర గాయాలయ్యాయి. 108లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో కనకమ్మ మృతి చెందింది.  శ్రీనివాస్‌ తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

==================

గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడి మృతి

దేవరపల్లి, మార్చి 1: టీ.నర్సాపురం మండలం తిరుమలదేవి పేట గ్రామానికి చెందిన రాజ్‌కుమార్‌ (25) మండలంలోని యర్నగూడెంలో నివాసం ఉంటున్నారు. దేవరపల్లి చికెన్‌షాపులో పనిచేస్తున్న ఇతను మధ్యాహ్నం భోజనానికి  యర్న గూడెం మోటార్‌సైకిల్‌పై వెళ్తుండగా మార్గమధ్యంలో రామన్నపాలెం చర్చి వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్టు ఎస్‌ఐ స్వామి తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇతను ఉపాధి కోసం వలస వచ్చాడన్నారు.. మృతదేహాన్ని కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు  ఎస్‌ఐ తెలిపారు. 

Advertisement
Advertisement
Advertisement