Abn logo
Jun 24 2021 @ 01:03AM

రైతు సంక్షేమానికి పెద్దపీట

నిడమనూరు మండలంలో రైతు వేదికను ప్రారంభిస్తున్న మంత్రి జగదీష్‌రెడ్డి

 రైతు వేదికలు సీఎం గొప్ప ఆలోచన

రైతును లక్షాధికారిని చేయడమే లక్ష్యం

వరి పండించడంలో మనమే నెంబర్‌వన్‌

మంత్రి  జగదీ్‌షరెడ్డి


నిడమనూరు/త్రిపురారం/హాలియా, జూన్‌ 23: రైతు సంక్షేమమే ధ్యేయం గా పనిచేస్తూ సీఎం కేసీఆర్‌ ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నారని విద్యుత్‌ శాఖ మంత్రి జగదీ్‌షరెడ్డి అన్నారు. నిడమనూరు మండలం ముప్పారం, నిడమనూరు, ఇండ్లకోటయ్యగూడెం, త్రిపురారం మండలం పెద్దదేవులపల్లి, త్రిపురారం గ్రామాల్లో రైతు వేదిక భవనాలను స్థానిక ఎమ్మెల్యే నోముల భగత్‌తో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతీ రైతును లక్షాధికారి చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం రైతన్నకు పెద్దపీట వేస్తోందన్నారు. పెట్టుబడుల కోసం రైతుల ఖాతాల్లో రైతుబంధు పేరిట డబ్బలు జమ చేయడం తెలంగాణలో మినహా దేశంలో ఎక్కడా లేదన్నారు. రైతు వేదికల ఏర్పాటు సీఎం కేసీఆర్‌ గొప్ప ఆలోచన అని, వ్యవసాయంలో రైతుకు విజ్ఞానాన్ని అందించేందుకు వేదికలు దోహదం చేస్తాయన్నారు. కేసీఆర్‌ పాలనలో రైతు రాజు అని, కాళేశ్వరం ప్రాజెక్టుతో 50 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చాయన్నారు. రైతుకు 24 గంటల కరెంటు అందిస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. వరి పండించడంలో దేశంలో మనమే ముందున్నామని తెలిపారు. రైతు పండించిన ప్రతీ గింజను కొనుగోలు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. ఆధునిక పద్ధ తులతో రైతులు వ్యవసాయం చేసే విధంగా వ్యవసాయాధికారులు తోడ్పాటునందించాలని సూచించారు. పలువురు రైతులతో ముఖాముఖిలో పాల్గొని అనుభవా లు తెలుసుకున్నారు. వ్యవసాయంలో ఎక్కువ లాభాలు ఆర్జించిన ఊట్కూరు గ్రా మానికి చెందిన నారాయణ అనే రైతును అభినందించి, మిగతా రైతులు నారాయణను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే నోముల భగత్‌ మాట్లాడు తూ టీఆర్‌ఎస్‌ పాలనలో రైతు రాజుగా వెలుగొందుతున్నాడన్నారు. అనంతరం మంత్రి నిడమనూరు మండలం ముప్పారం గ్రామంలో రూ.50లక్షలతో నిర్మిస్తున్న ప్రాచీన శివాలయం పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేసి భూమి పూజలో పాల్గొన్నారు. 


చెక్‌ డ్యాంలతో భూగర్భజలాల వృద్ధి

చెక్‌ డ్యాంల ఏర్పాటుతో భూగర్భజలాలు వృద్ధి చెందుతాయని మంత్రి జగ దీష్‌రెడ్డి అన్నారు. అనుముల మండలం హజారిగూడెంలో రూ.8కోట్ల 75లక్షలతో, నిడమనూరు మండలం వెనిగండ్లలో రూ.2.5కోట్లతో చేపట్టిన చెక్‌డ్యాం పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి అధిక ప్రాధాన్యమిస్తూ దేశంలోనే అత్యధికంగా వరి పండించే రాష్ట్రంగా ఎదిగిందన్నారు. నిడమనూరులో రాంచందర్‌నాయక్‌, ఇరిగి పెద్దులు, బొల్లం జయమ్మ, నందికొండ రామేశ్వరి, ఎంసీకోటిరెడ్డి, చేకూరి హన్మంతరావు, విరిగినేని అంజయ్య, కామర్ల జానయ్య, సత్యపాల్‌, సర్పంచులు మేరెడ్డి పుష్పలత, అల్లం శ్రీను, అంకతి నర్మద, అంకతి వెంకటరమణ,  త్రిపురారంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు ఇస్లావత్‌ రాంచందర్‌నాయక్‌, ఎంపీపీ అనుముల పాండమ్మ, జడ్పీటీసీ ఽధనావత్‌ భారతి, మార్కెట్‌ చైర్మన్‌ కామెర్ల జానయ్య, వ్యసాయాధికారి పార్వతి, నాయకులు నరేందర్‌, రాంచంద్రయ్య, చంద్రారెడ్డి, నర్సిరెడ్డి, చంద్రారెడ్డి, గుండెబోయిన వెంకటేశ్వర్లు, హాలియాలో ఇరిగి పెద్దులు, మలిగిరెడ్డి లింగారెడ్డి, యడవెల్లి మహేందర్‌రెడ్డి, కేవీ రామారావు, సర్పంచ్‌లు పోలే డేవిడ్‌, రావుల చిన్నభిక్షం, ఆవుల పురుషోత్తం, తహసీల్దార్‌ మంగ, ఎస్‌ఈ ధర్మానాయక్‌, ఆంజనేయులు, వద్దిరెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.