Abn logo
Oct 1 2021 @ 00:00AM

ఖైదీలను వణికించిన జైలు!

ఆ జైలు పేరెత్తితే ఖైదీలు గజగజ వణికిపోయేవారు. ఆ జైలులో నుంచి తప్పించుకోవడం అసాధ్యం. పేరుమోసిన నేరగాళ్లందరూ ఆ జైలులోనే శిక్ష అనుభవించే వారు. కట్టుదిట్టమైన భద్రత కలిగిన జైలుగా పేరొందిన అల్కాట్రాజ్‌ విశేషాలు ఇవి...


 అల్కాట్రాజ్‌... అమెరికాలో శాన్‌ఫ్రాన్సిస్కో తీరానికి ఒకటిన్నర మైలు దూరంలో ఉన్న దీవి ఇది. ప్రారంభంలో లైట్‌హౌజ్‌గా గుర్తింపు పొందిన ఈదీవి తరువాత కాలంలో జైలుగా మారింది.


 115 ఎకరాల్లో విస్తరించిన ఉన్న ఈ దీవిని అమెరికా 1934లో  జైలుగా మార్చింది. 1850లో అల్కాట్రాజ్‌ ఫోర్ట్‌ను నిర్మించారు. 


 సముద్రం మధ్యలో ఉన్న ఈ దీవిలో నుంచి తప్పించుకోవడం అసాధ్యం. ఎందుకంటే నీళ్లు చాలా చల్లగా ఉంటాయి. ఆ నీళ్లలో ఈదుకుంటూ బయటకు రావడం సాధ్యం కాదు. అందుకే అమెరికా ఆ ఫోర్ట్‌ను జైలుగా మార్చింది. ఈ జైలులో కఠినమైన నిబంధనలు అమలు చేసే వారు. 1963లో వివిధ కారణాల వల్ల ఈ జైలును మూసేశారు. ప్రస్తుతం ఈ దీవిని సందర్శించే పర్యాటకుల సంఖ్య కూడా ఎక్కువే.