ఆదివాసీ గిరిజన యువకుడికి అరుదైన గౌరవం

ABN , First Publish Date - 2021-01-21T04:16:00+05:30 IST

జిల్లాలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబంలో జన్మించిన ఆదివాసీ గిరిజన యువకుడికి ఓ అరుదైన అవకాశం లభించింది. ఆదిలాబాద్‌ మండలంలోని చించు ఘాట్‌ గ్రామానికి చెందిన కాత్లె మారుతికి రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ నుంచి కేంద్రంలో నిర్వహించే గణతంత్ర దినోత్సవాలకు హాజరు కావాలని పిలుపు వచ్చింది.

ఆదివాసీ గిరిజన యువకుడికి అరుదైన గౌరవం

గణతంత్ర వేడుకలకు హాజరు కావాలని ఢిల్లీ నుంచి పిలుపు

ఆదిలాబాద్‌రూరల్‌, జనవరి 20: జిల్లాలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబంలో జన్మించిన ఆదివాసీ గిరిజన యువకుడికి ఓ అరుదైన అవకాశం లభించింది. ఆదిలాబాద్‌ మండలంలోని చించు ఘాట్‌ గ్రామానికి చెందిన కాత్లె మారుతికి రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ నుంచి కేంద్రంలో నిర్వహించే గణతంత్ర దినోత్సవాలకు హాజరు కావాలని పిలుపు వచ్చింది. పట్టభద్రుడై, నిరుద్యోగిగా ఉంటూ ఇంటి పనులతో పాటు వ్యవసాయ పనులు చేసుకుంటూ తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. ప్రధానమంత్రి, రాష్ట్రపతి పాల్గొనే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆహ్వానం లభించడంతో ఆ కుటుంబంలో ఆనందోత్స వాలు వెల్లు విరుస్తున్నాయి. మారుతి ఎంఎ సామాజిక శాస్త్రంలో పట్టా సాధంచాడు. తల్లిదండ్రులు కూలీనాలి చేసి కొడుకును కష్టపడి చదివించి నందుకు ఫలితం లభించినట్లుగా తల్లిదండ్రులు భావిస్తున్నారు.

Updated Date - 2021-01-21T04:16:00+05:30 IST