Advertisement

రెహమాన్‌కు అరుదైన గౌరవం

భారతీయులనే కాకుండా ప్రపంచ సినీప్రియులను కూడా తన సంగీతంలో అలరిస్తున్న ప్రతిభాశాలి ఏ.ఆర్‌.రెహమాన్‌కు తాజాగా మరో అరుదైన గౌరవం దక్కింది. సినీ సంగీతానికి ఆయన అందిస్తున్న సేవలను గుర్తించి, కైరో అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఆయన్ని సత్కరించి, ప్రత్యేక ప్రశంసా పత్రం అందజేశారు. సోమవారం సోషల్‌ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు రెహమాన్‌. 


Advertisement