Advertisement
Advertisement
Abn logo
Advertisement

అభివృద్ధి చేస్తేనే నిజమైన నివాళి

 నెల్లికల్‌ లిఫ్టు నోముల కల 

 మాజీ ఎమ్మెల్యేలు నర్సింహయ్య, రాంమూర్తి యాదవ్‌ల విగ్రహావిష్కరణలో మంత్రి జగదీ్‌షరెడ్డి

నిడమనూరు, డిసెంబరు 1: దివగంత మాజీ ఎమ్మెల్యేలు నోముల నర్సింహయ్య, రాంమూర్తియాదవ్‌ నిత్యం ప్రజల కోసమే తపించేవారని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి కొనియాడారు. నర్సింహయ్య ప్రథమ వర్థంతి సందర్భంగా మండలంలోని వేంపాడ్‌ స్టేజీ వద్ద ఏర్పాటు చేసిన నర్సింహయ్య, రాంమూర్తియాదవ్‌ విగ్రహాలను శాసనమండలి మాజీ చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, నాగార్జునసాగర్‌ ఎమ్మెల్యే నోముల భగత్‌తో కలిసి బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆ ఇద్దరు నాయకులు చరిత్ర నిర్మాతలుగా మిగిలారని కొనియాడారు. పదవిలో ఉన్నా, లేకు న్నా వారు తమ పోరాటాన్ని ఆపలేదని, ప్రజల కోసమే చివరి వరకు పని చేశారని గుర్తు చేశారు. నియోజకర్గంలో అభివృద్ధి వారిద్దరి చలవేనన్నారు. నియోజకవర్గంలో మిగిలిపోయిన పనులను రెండేళ్లలో పూర్తి చేయాలని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తేనే నర్సింహయ్యకు నిజమైన నివాళి అని అన్నారు. నెల్లికల్‌ లిఫ్టు నర్సింహయ్య కల అని, ఆయన స్వప్నం సాకారమ్యే రోజు ఆసన్నమైందన్నారు. ఎమ్మెల్యే నోముల భగత్‌ మాట్లాడుతూ పేదల అభ్యున్నతే లక్ష్యంగా దివంగత నాయకులు పని చేశారని, వారి ఆశయ సాధనకు కృషి చేస్తూ నియోజకవర్గ అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా పనిచేస్తానని హా మీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు భాస్కర్‌రావు, కంచర్ల భూపాల్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, సైదిరెడ్డి, రవీంద్రకుమార్‌, ఎంసీ కోటిరెడ్డి, ఏపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌, నాయకులు రాంచందర్‌నాయక్‌, ఇరిగి పెద్దులు, సత్యపాల్‌, ఎంపీపీ జయమ్మ, జానయ్య పాల్గొన్నారు.

గ్రూపులు కడితే గులాబీ జెండా ఎగరదు: ఎమ్మెల్సీ గుత్తా

  పార్టీలో గ్రూపులు ఏర్పాటు చేసి ఒకరి వెనుకాల మరొకరు గోతులు తవ్వుకుంటే వచ్చే ఎన్నికల్లో సాగర్‌లో గులాబీ జెండా ఎగరదని, అందరూ ఐక్యంగా పని చేసుకుంటూ పోవాలని శాసనమండలి మాజీ చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి హెచ్చరించారు.  భగత్‌, కోటిరెడ్డి కలిసి పని చేయాలని, వర్గాలుగా విడిపోతే ప్రమాదమేనన్నారు. ఒకరి గురించి మరొకరు గోతులు తవ్వుకునే ఆలోచన మానుకోవాలని సూచించారు. ఎన్నికలకు రెండేళ్ల వ్యవథి మాత్రమే ఉందని, సమయం తక్కువగా ఉండి సమస్యలు ఎక్కువగా ఉన్నాయన్నారు. పార్టీ శ్రేణులు సమన్వయంతో పని చేస్తేనే విజయం సాధిస్తామని, గ్రూపులు ఉంటే నష్టపోతామన్నారు. ఎమ్మెల్యే భగత్‌ ప్రజల్లోనే ఉండాలని, పట్నంలో ఉండొద్దని సూచించారు. సమస్యలు పరిష్కరించి ప్రజలకు చేరువైతేనే వచ్చే ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురుతుందని గుర్తు చేశారు. పెద్దవూర, గుర్రంపోడు మండలాల్లో నర్సింహయ్య చిత్రప టాల వద్ద నివాళులర్పించారు. గుర్రంపోడులో పండ్లు పంపిణీ చేశారు.

Advertisement
Advertisement