రైతుపై దురుసుగా ప్రవర్తించిన సచివాలయ ఉద్యోగి

ABN , First Publish Date - 2021-08-02T05:45:54+05:30 IST

మండల పరిధిలోని కోటపల్లి సచివాలయంలో పనిచేస్తున్న డిజిటల్‌ అసిస్టెంట్‌ సమ్‌సుద్దీన ఓ రైతుపై దురుసుగా వ్య వహ రించిన వీడియో ఆదివారం వైరల్‌ అయ్యింది.

రైతుపై దురుసుగా ప్రవర్తించిన సచివాలయ ఉద్యోగి

  తనకల్లు, ఆగస్టు 1: మండల పరిధిలోని కోటపల్లి సచివాలయంలో పనిచేస్తున్న డిజిటల్‌ అసిస్టెంట్‌ సమ్‌సుద్దీన ఓ రైతుపై దురుసుగా వ్య వహ రించిన వీడియో ఆదివారం వైరల్‌ అయ్యింది. రైతు తన కులధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకుని, వాటికోసం డిజిటల్‌ అసిస్టెంట్‌ వద్దకు వె ళ్లాడు. ఆయన ఫోనలో మాట్లాడుకుంటూ రైతు అడుగుతున్నా సమాధానం చెప్పకుం డా ఆఖరుకు రైతును కసురుకున్న విషయం వీడియోల్లో వైరల్‌ అ య్యింది. ఈ విషయాన్ని ఈఓఆర్‌డీ దృష్టికి తీసుకెళ్ళగా గతంలో కూడా డిజిటల్‌ అసి స్టెంట్‌పై ఫిర్యాదులు అందాయని, ఈ విషయంపై మెమో జారీ చేసి, విచారణ నిర్వహిస్తామని ఈఓఆర్‌డీ ఆనందయ్య తెలిపారు. రైతులపై నిర్లక్ష్యంగా వ్య వహరిస్తున్న డిజిటల్‌ అసిస్టెంట్‌పై తగిన చర్యలు తీసుకోవాలని మం డలంలోని గిరిజన సంఘం నాయకులు ప్రసాద్‌ నాయక్‌, రామ్మూర్తినా యక్‌, దళిత సంఘం నాయకులు శం కర్‌, కిష్టప్ప, కాంగ్రెస్‌ నాయకులు పారే సు, రైతు సంఘం నాయకులు రమణ, కులవివక్ష పోరాట సమితి నాయకులు ఒట్టెద్దు వేమన్న, రైతు నాయకులు రమణ తదితరులు డిమాండ్‌ చేశారు.  


Updated Date - 2021-08-02T05:45:54+05:30 IST