Advertisement
Advertisement
Abn logo
Advertisement
Oct 1 2021 @ 17:27PM

గ్రూపులు రెండు.. killar ఒక్కడే.. చివరకు 1340 సంవత్సరాల జైలు.. అసలు ఏం జరిగింది..?

ఇటీవల నేరస్థులు చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నారు. సినిమాలు చూసి కొత్తకొత్త తెలివితేటలతో పోలీసులకు చిక్కకుండా నేరాలు చేస్తూ.. మన మధ్యే దర్జాగా తిరుగుతుంటారు. ఒక్కోసారి నేరాలు జరిగితే.. కన్నుక్కోవడానికి పోలీసులు తలలు పట్టుకోవాల్సి వస్తుంది. అయితే ఎంతటి తెలివైన నేరస్థుడైనా చివరకు ఏదో చోట తెలీకుండానే క్లూ ఇచ్చి.. పోలీసులకు దొరికిపోతుంటారు. ఇప్పుడంటే టెక్నాలజీ పెరిగింది కాబట్టి.. నేరస్థులు కొత్త కొత్త ప్లాన్‌లు వేస్తున్నారు. అయితే దక్షిణాఫ్రికాలో 1996, 97లోనే ఓ కిల్లర్, నేటి టెక్నాలజీ తెలివితేటలను తలపించేలా.. పోలీసులకు చుక్కలు చూపించాడు. అయితే చివరకు చిన్న క్లూతో దొరికిపోయాడు. ఫైనల్‌గా కోర్టు అతడికి 1,340 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అన్నాళ్లు జైలు శిక్షలుంటాయా అని ఆశ్చర్యపోతున్నారా.. ఇది నిజమే..


అది దక్షిణాఫ్రికా, జోహాన్నెస్‌బర్గ్‌లోని ఓ ఏరియా. మాయోపా సెడ్రిక్ మాకే(1965) ఉరఫ్ వెమ్మెర్ పాన్ అనే కిల్లర్..  స్థానికంగా నివాసముండేవాడు. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో 1996 నుంచి 1997 వరకూ జరిగిన నేరాలు మిస్టరీగా మారాయి. ఈ కేసులు పోలీసులకు పెద్ద సవాల్‌గా మారాయి. హత్యలన్నీ వివిధ పద్ధతుల్లో జరుగుతుండడంతో.. బహుశా రెండు రకాల గ్రూపులు ఈ దారుణానికి పాల్పడి ఉండొచ్చని జోహాన్నెస్‌బర్గ్ పోలీసులు భావించారు. ఆ కోణంలోనే దర్యాప్తు ప్రారంభించారు. హత్య జరిగిన విధానాన్ని బట్టి.. దాన్ని ఆ గ్రూపు ఖాతాలో వేసేవారు. ఇలా చివరకు ఓ ప్రొఫైల్ తయారుచేశారు.

 పోలీసుల ఉద్దేశంలో మొదటి గ్రూపు సాధారణ హత్యలకు సంబంధించినదిగా, సుత్తితో కొట్టి చంపే హత్యలు... రెండో గ్రూపు వారివిగా నమోదు చేసుకున్నారు. రోడ్డుపై వెళ్లే మహిళలు, పురుషుల్ని టార్గెట్ చేసి, బండరాళ్లతో కొట్టి నగలు.. నగదు ఎత్తుకెళ్లేవారు. అలాగే వాహనాల్లో వెళ్లే వారిని టార్గెట్ చేసి పురుషులను గన్‌తో కాల్చడం, ఆడవారిని అత్యాచారం చేసి.. తర్వాత చంపడం చేస్తుండేవారు. ఈ రకం కేసులన్నింటినీ పోలీసులు.. మొదటి గ్రూపు ఖాతాలో వేసేవారు.


అలాగే మరోవైపు స్థానిక టైలర్ షాపులకు వెళ్లి, యజమానులను సుత్తితో కొట్టి చంపి.. విలువైన వస్తువుల్ని ఎత్తుకుపోయేవారు. సుత్తితో కొట్టి ఘోరంగా హత్య చేసేవారు. ఈ రకం హత్యలన్నింటినీ రెండో గ్రూపు వారు చేస్తున్నట్లుగా పోలీసులు ఊహించుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. వారిని ఎలా పట్టుకోవాలో తెలీక తలలు పట్టుకునేవారు. అందులోనూ ఆ కాలంలో సీసీ కెమెరాలు లేనందున.. పెద్ద సమస్యగా మారింది. ఎక్కడా ఆధారాలు దొరక్కుండా హత్యలు జరుగుండడంతో స్థానికుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. మరోవైపు పోలీసు ఉన్నతాధికారుల నుంచి స్థానిక పోలీసుకు ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి.

ఈ క్రమంలో ఓ రోజు టైలర్ షాప్ దగ్గర పోలీసులకు ఓ స్లిప్ దొరికింది. అందులో ఓ వ్యక్తి సంతకం కనిపించింది. దీన్ని చూసి పోలీసులు షాక్ అయ్యారు. ఎందుకంటే అలాంటి సంతకం.. ఓ సారి పోలీసులకు లభించింది. దీంతో ఈ హత్యలన్నీ ఒకే గ్రూపు చేస్తోందనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. నేరాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాల్లో మఫ్టీ పోలీసులను పెట్టారు. 1997 డిసెంబర్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని చూడగానే ఉన్నతాధికారులు షాక్ అయ్యారు. తనను ఎక్కడో చూసినట్లుగా భావించారు. దీనిపై ఆ యువకుడిని ప్రశ్నించగా.. తాను స్థానికుడినని, గతంలో పలు నేరాలకు సంబంధించి పలు విషయాలు తెలియజేశానని చెప్పుకొచ్చాడు. దీంతో పోలీసుల అనుమానం మరింత బలపడింది. వారి స్టైల్‌లో విచారించడంతో మొత్తం కక్కేశాడు.


అంతవరకు గ్రూపు హత్యలుగా భావించిన పోలీసులకు.. అవన్నీ ఒక్కడే చేస్తున్నాడని, వాడే వచ్చి తమకు దొరికిపోయాడని తెలిసి అవాక్కయ్యారు. ఆ నేరస్థుడి తెలివితేటలు.. పోలీసులకు కొత్త కొత్త పాఠాలను నేర్పించాయి. నేరాలన్నీ ఎక్కువ భాగం రెండు ఇళ్ల సమీప ప్రాంతాల్లో జరిగాయి. ఈ కిల్లర్ పనిచేసిన ఇల్లు, అతడి సోదరుడు, అతని గర్ల్‌ఫ్రెండ్ ఉంటున్న ఇళ్ల చుట్టూ తిరుగుతూ హత్యలు చేశాడని తెలిసింది. ఆ సీరియల్ కిల్లర్ మొత్తం.. 27 హత్యలు, 26 హత్యాయత్నాలు, 14 అత్యాచారాలు, 41 దోపిడీలు కలిపి మొత్తం 114 నేరాలు చేసినట్లు కోర్టు తేల్చింది. ఈ కేసులన్నింటికీ కలిపి.. 27 జీవిత ఖైదులను విధించింది. మొత్తంగా 1,340 సంవత్సరాలు జైల్లో ఉండాలని తీర్పు ఇచ్చింది. ఇలా ఈ కేసు అప్పట్లో సంచలనమైంది. ఆ సీరియల్ కిల్లర్‌ను దక్షిణాఫ్రికా ప్రజలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటూ ఉంటారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement