అజారుద్దీన్‌కు ఎదురుదెబ్బ

ABN , First Publish Date - 2021-04-19T21:37:20+05:30 IST

హెచ్‌సీఏ అధ్యక్షుడు, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజారుద్దీన్‌కు గట్టి ఎదురుదెబ్బ

అజారుద్దీన్‌కు ఎదురుదెబ్బ

హైదరాబాద్: హెచ్‌సీఏ అధ్యక్షుడు, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజారుద్దీన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హెచ్‌సీఏ అంబుడ్స్‌మెన్‌గా ఉన్న దీపక్ వర్మ తన పదవికి హఠాత్తుగా రాజీనామా చేశారు. ఈ విషయాన్ని అజర్‌కు ఈమెయిల్ ద్వారా దీపక్ పంపారు. ఈ నెల 14న ఏజీఎం సమావేశం ముగియగానే అజర్ పంపిన ఈ మెయిల్ ఆధారంగా అంబుడ్స్‌మెన్‌గా దీపక్ వర్మ బాధ్యతలు స్వీకరించారు.


 అయితే 85వ ఏజీఎంలో మెజారిటీ సభ్యుల ఆమోదంతో అంబుడ్స్‌మెన్‌ ఎథిక్స్ ఆఫీసర్‌గా ఇద్దరూ రిటైర్డ్ న్యాయమూర్తులను నియమించినట్టు హెచ్‌సీఏ సెక్రటరీ విజయానంద్ నుంచి తనకు లేఖ అందిందని అజర్‌కు పంపించిన ఈ మెయిల్‌లో దీపక్ వర్మ తెలియజేశారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చుట్టూ అనేక వివాదాలు ముసురుకున్న ఈ సమయంలో తాను అంబుడ్స్‌మెన్‌గా కొనసాగలేనని దీపక్ పేర్కొన్నారు. రెండు వర్గాల మధ్య నడుస్తున్న రాజకీయాల్లో తనని దయచేసి మధ్యలోకి లాగొద్దని అజర్‌కి దీపక్ వర్మ ఈమెయిల్ పంపారు.

Updated Date - 2021-04-19T21:37:20+05:30 IST