Abn logo
Sep 23 2021 @ 00:56AM

మాజీ మంత్రిదామచర్ల ఆంజనేయులుకు ఘన నివాళి

ఆంజనేయులు, ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులర్పిస్తున్న దామచర్ల జనార్దన్‌, నాయకులు

నగరంలో వర్ధంతి కార్యక్రమాలు

నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే జనార్దన్‌


ఒంగోలు(కార్పొరేషన్‌), సెప్టెంబరు 22 : మా జీ మంత్రి దామచర్ల ఆంజనేయులు 14వ వర్ధం తి బుధవారం ఒంగోలులో ఘనంగా నిర్వహించా రు. ఈ సందర్భంగా స్థానిక టీడీపీ కార్యాలయ ంలో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, రా ష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్ధన్‌, పార్టీ శ్రేణు లతో కలిసి ఆంజనేయులు విగ్రహానికి పూలమా ల వేసి ఘనంగా నివాళులర్పించారు. ముందుగా స్థానిక బాపూజీ మార్కెట్‌ కాంప్లెక్స్‌ ఎదురు, అ లాగే కర్నూలురోడ్‌లోని ఫ్లైఓవర్‌ బ్రిడ్జి వద్ద ఆం జనేయులు విగ్రహాలకు పూలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా దామచర్ల మాట్లాడుతూ నిరా డంబర ప్రజానేతగా తన తాత ఆంజనేయులు చేసిన సేవలు ఎనలేనివన్నారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌ మంత్రిగా రాష్ట్రంతో పాటు, జిల్లా అభివృ ద్ధి కోసం చేసిన కృషి అనిర్వచనీయమని కొని యాడారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని తెలిపారు. అనంతరం తూర్పునా యుడుపాలెంలో ఏర్పాటు చేసిన వర్ధంతి కార్యక్ర మానికి ఒంగోలు నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు తరలివెళ్లాయి. 


చంద్రబాబు నివాళి


తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆంజనే యులు తన అంతిమ శ్వాస వరకు పార్టీ ఆదర్శా లకు కట్టుబడి ప్రజాసేవ చేశారని, పెద్దాయన సే వలు మరువలేనివని పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలి పారు. బుధవారం దామచర్ల ఆంజనేయులు వ ర్ధంతి సందర్భంగా చంద్రబాబు సోషల్‌మీడియా ద్వారా ఘనంగా నివాళులర్పించారు.