పోలీసు అమరులకు ఘన నివాళి

ABN , First Publish Date - 2021-10-22T05:47:27+05:30 IST

పోలీసు అమర వీరుల దినోత్సవం సందర్భంగా గురువారం హుస్నాబాద్‌ పట్టణంలో పోలీసులు పలు కార్యక్రమాలు నిర్వహించారు.

పోలీసు అమరులకు ఘన నివాళి
హుస్నాబాద్‌లో ఎస్‌ఐ జాన్‌విల్సన్‌ విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న దృశ్యం

 హుస్నాబాద్‌లో 21 కిలోమీటర్ల మారథాన్‌


హుస్నాబాద్‌, అక్టోబరు 21: పోలీసు అమర వీరుల దినోత్సవం సందర్భంగా గురువారం హుస్నాబాద్‌ పట్టణంలో పోలీసులు పలు కార్యక్రమాలు నిర్వహించారు. నక్సల్స్‌ పేల్చిన మందుపాతరలో అసువులు బాసిన సీఐ యాదగిరి చిత్రపటానికి, ఎస్‌ఐ జాన్‌విల్సన్‌ విగ్రహానికి ఏసీపీ సతీష్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఆకుల రజిత పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏసీపీ సతీష్‌ మాట్లాడుతూ.. పోలీసులు పగలు, రాత్రి తేడా లేకుండా 24 గంటలు సేవలందిస్తున్నారన్నారు. కార్యక్రమంలో సీఐ రఘుపతిరెడ్డి, ఎస్‌ఐలు రవి, రాజకుమార్‌, మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్‌, కౌన్సిలర్‌ భాగ్యారెడ్డి, డాక్టర్‌ రవీ, ట్రెయినీ ఎస్‌ఐలు శ్వేతారెడ్డి, శ్రీనివాస్‌, విజయ్‌ పాల్గొన్నారు. పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా హుస్నాబాద్‌ పట్టణంలో ఆఫ్‌ మారథాన్‌ (21 కిలోమీటర్ల రన్నింగ్‌) నిర్వహించారు. 


గోల్డెన్‌ వాకర్‌ సభ్యుల నివాళి


సిద్దిపేట: పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం ఉదయం సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో గోల్డెన్‌ వాకర్‌ సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. శాంతి భద్రతల విషయంలో పోలీసులకు సహకరిస్తామని, చట్టానికి కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. 


దుబ్బాకలో విద్యార్థుల ర్యాలీ 


దుబ్బాక/మిరుదొడ్డి: పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివని దుబ్బాక సీఐ శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. గురువారం దుబ్బాక, మిరుదొడ్డి మండల కేంద్రాల్లో వేర్వేరుగా పోలీస్‌ అమరవీరుల దీనోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి పోలీసులు  ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో దుబ్బాక, మిరుదొడ్డి, భూంపల్లి ఎస్‌ఐలు మన్నె స్వామి, శ్రీనివాస్‌, సర్థార్‌జమాల్‌, ఏఎ్‌సఐ లక్ష్మణ్‌ పాల్గొన్నారు.


పలు మండల కేంద్రాల్లో


మద్దూరు: పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివని మద్దూరు సర్పంచ్‌ కంఠారెడ్డి జనార్ధన్‌రెడ్డి అన్నారు. గురువారం మండలకేంద్రంలోని పోలీసు అమరవీరుల స్థూపం వద్ద ఎస్‌ఐ ఏవీకే భాగ్యరాజ్‌, పోలీసు సిబ్బందితో కలిసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ ఆరీఫ్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌, కానిస్టేబుళ్లు రాజ్‌కుమార్‌, యాకన్న, వెంకన్న, స్రవంతి, పంచాయతీ సెక్రటరీ ప్రవీణ్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.  

చేర్యాల: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకలను గురువారం చేర్యాల పోలీసుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. చేర్యాల పోలీ్‌సస్టేషన్‌ నుంచి స్మారకస్థూపం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం చేర్యాల సీఐ భీంరెడ్డి శ్రీనివా్‌సరెడ్డి, ఎస్‌ఐ రాకేశ్‌, పోలీసు సిబ్బంది, కౌన్సిలర్లు స్మారకస్థూపం వద్ద నివాళులర్పించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు ఆడెపు నరేందర్‌, చెవిటి లింగం, పచ్చిమడ్ల సతీశ్‌, మంగోలు చంటి, నాయకులు అందె బీరయ్య, అంకుగారి శశిధర్‌రెడ్డి, ముస్త్యాల బాలనర్సయ్య, కందుకూరి సిద్ధిలింగం, ఒగ్గు రాజు, ఉడుముల భాస్కర్‌రెడ్డి, బుట్టి సత్యనారాయణ, ఏఎ్‌సఐలు కృష్ణమూర్తి, ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

జగదేవ్‌పూర్‌: అమరవీరుల ఫ్లాగ్‌ డే సందర్భంగా గురువారం జగదేవపూర్‌ ఎస్‌ఐ పరమేశ్వర్‌, శిక్షణ ఎస్‌ఐ ప్రసాద్‌, పోలీసు సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఏఎ్‌సఐలు బాల మల్లయ్య, పర్వేజ్‌, కానిస్టేబుళ్లు స్వామి, రాజు, రామకృష్ణ, పరశురాం, చంద్రం, మహేష్‌, భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.


 

Updated Date - 2021-10-22T05:47:27+05:30 IST