Abn logo
Sep 23 2021 @ 00:41AM

మాజీ మంత్రి కాలవకు ఘన స్వాగతం

కాలవకు స్వాగతం పలుకుతున్న నాయకులు

అనంతపురంరూరల్‌,సెప్టెంబరు22: మాజీ మం త్రి కాలవ శ్రీనివాసులుకు ఆంధ్రప్రదేశ వాల్మీకి బోయ సంఘం నాయకులు బెంగళూరు విమానాశ్రయంలో బు ధవారం ఘన స్వాగతం పలికారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన వాల్మీకి సదస్సులో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో వాల్మీకి, బోయల ఎస్టీ హోదా అంశంపై  ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి వినతి పత్రం అందజేశారు.  కేం ద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్న వాల్మీకుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని ఆయనను కోరా రు. ఢిల్లీ పర్యటన ముగించుకుని జిల్లాకు వస్తున్న కా లవను వాల్మీకి బోయ సంఘం నాయకులు కలసి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షప్రధాన కార్యదర్శులు మ ణిరవి, పేరంహరి, చౌడయ్య తదితరులు పాల్గొన్నారు.