స్టేడియం ఆవరణలో తొక్కిసలాట 8 మంది మృతి

ABN , First Publish Date - 2022-01-26T09:13:31+05:30 IST

ఆఫ్రికా కప్‌ ఆఫ్‌ నేషన్స్‌ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఎనిమిది మంది మృత్యవాత పడ్డారు.

స్టేడియం ఆవరణలో తొక్కిసలాట  8 మంది మృతి

యౌండే (కామెరూన్‌): ఆఫ్రికా కప్‌ ఆఫ్‌ నేషన్స్‌ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఎనిమిది మంది మృత్యవాత పడ్డారు. అలాగే 38 మందికి తీవ్రగాయాలయ్యాయి. దేశ రాజధాని యౌండేలో సోమవారం కామెరూన్‌-కామరో్‌స మధ్య జరిగిన ఈ మ్యాచ్‌ కోసం వేలాదిగా అభిమానులు తరలివచ్చారు. గతేడాది నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ స్టేడియం సామర్థ్యం 60వేలు. కానీ కరోనా కారణంగా 80 శాతం మందిని మాత్రమే అనుమతించాలని నిర్ణయించారు. అయితే, 50వేల మంది మ్యాచ్‌ కోసం ఎగబడడంతో పాటు, లోనికి వెళ్లేందుకు ఒకే గేట్‌ తెరవడంతో ఒక్కసారిగా తోపులాట జరిగింది. దీంతో ఈ దారుణం చోటు చేసుకోగా మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు.  ఫుట్‌బాల్‌ను అమితంగా ఆరాధించే కామెరూన్‌లో ఏభై ఏళ్ల తర్వాత ఆఫ్రికా కప్‌ ఆఫ్‌ నేషన్స్‌ జరుగుతోంది. దీంతో అభిమానుల్లో ఎక్కడలేని క్రేజ్‌ ఏర్పడినా ఏర్పాట్లలో లోపం జరిగింది. అయితే బయట ఇంత ఘోరం జరిగినా స్టేడియంలో యథావిధిగా జరిగిన మ్యాచ్‌లో కామెరూన్‌ 2-1తో గెలిచింది.

Updated Date - 2022-01-26T09:13:31+05:30 IST