ఫలించిన పునరావాస పోరాటం

ABN , First Publish Date - 2022-08-01T06:55:57+05:30 IST

రెండు దశాబ్దాల నుంచి పునరావాసం కోసం గుండెగావ్‌ గ్రామస్థులు చేస్తున్న పోరాటం ఎట్టకేలకు ఫలించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి తమకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద నష్టపరిహారం అందించి పునరావాసం కల్పించాలంటూ గ్రామస్థులు చేసిన 20 ఏళ్ల పోరాటానికి స ర్కారు దిగి వచ్చింది. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ పాలనలో పునరావాసం హామీ లభించినప్పటికీ నెరవేరకుండానే తెలంగాణ రాష్ట్రం ఏ ర్పడింది. రాష్ట్రం ఏర్పడి ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్నా సమస్య పరిష్కారం కావడం లేదంటూ గుండెగావ్‌ గ్రామస్థులు ఇప్పటికీ ఆం దోళనలు చేస్తూనే ఉన్నారు.

ఫలించిన పునరావాస పోరాటం
పల్సీకర్‌ రంగారావు ప్రాజెక్ట్‌ దృశ్యం

ఎట్టకేలకు పచ్చజెండా

పరిష్కారం దిశగా గుండెగాం సమస్య 

ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కిందనే పునరావాసం

నిర్మల్‌, జూలై 31 (ఆంధ్రజ్యోతి): రెండు దశాబ్దాల నుంచి పునరావాసం కోసం గుండెగావ్‌ గ్రామస్థులు చేస్తున్న పోరాటం ఎట్టకేలకు ఫలించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి తమకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద నష్టపరిహారం అందించి పునరావాసం కల్పించాలంటూ గ్రామస్థులు చేసిన 20 ఏళ్ల పోరాటానికి స ర్కారు దిగి వచ్చింది. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ పాలనలో పునరావాసం హామీ లభించినప్పటికీ నెరవేరకుండానే తెలంగాణ రాష్ట్రం ఏ ర్పడింది. రాష్ట్రం ఏర్పడి ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్నా సమస్య పరిష్కారం కావడం లేదంటూ గుండెగావ్‌ గ్రామస్థులు ఇప్పటికీ ఆం దోళనలు చేస్తూనే ఉన్నారు. ప్రతీ ఎన్నికల సమయంలో అధికార పార్టీ నాయకులు గుండెగావ్‌ సమస్యను పరిష్కరిస్తామంటూ హామీలు ఇ స్తూ వస్తున్నారు. ఎమ్మెల్యేలతో పాటు ముఖ్యమంత్రి సైతం గుండెగా వ్‌ సమస్యను పరిష్కరిస్తానంటూ హామీనిచ్చారు. అయితే ఆ హామీ ఏళ్ల నుంచి పరిష్కారం కాకపోవడంతో గుండెగావ్‌ గ్రామస్థులు పోరుబాటను ఎంచుకున్నారు. కాగా, ప్రతీ సంవత్సరం వర్షకాలంలో గుండెగావ్‌ గ్రామాన్ని పల్సీకర్‌ రంగారావు ప్రాజెక్ట్‌ బ్యాక్‌వాటర్‌ ముంపుతో భైంసాకు తాత్కాలికంగా తరలిస్తున్నారు. ప్రతీ ఏటా వర్షకాలంలో గ్రామస్థులకు తాత్కాలిక పునరావాసం కల్పించడం సంబంధిత యం త్రాంగానికి తలనొప్పిగా మారింది. చిన్నసుద్దవాగు (పల్సీకర్‌ రంగారా వు ప్రాజెక్ట్‌) నిర్మాణంలో భాగంగా గుండెగావ్‌ గ్రామం బ్యాక్‌ వాటర్‌ ముంపుకు గురువుతోంది. అయితే ప్రభుత్వం ఈ గ్రామ పునరావాసం కోసం రూపొందించిన ప్రతిపాదనలను గ్రామస్థులంతా తిరస్కరించి తమకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద పరిహారం అందించాలంటూ డి మాండ్‌ చేశారు. రిహబిలిటేషన్‌ అండ్‌ రిసెటిల్‌మెంట్‌ ప్యాకేజీ ద్వారా నే తమకు పునరావాసం కల్పిస్తే అంగీకరిస్తామని లేదంటే తాము గుండెగావ్‌ గ్రామాన్ని విడిచిపెట్టి పోయేదేలేదంటూ భీష్మించుకున్నా రు. జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు వీరికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీని అంగీకరిస్తామని, ఏ ఇతర ప్రత్యామ్నాయాన్ని పట్టించుకోమంటూ స్పష్టం చేశారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులపై ప్రజల నుంచే కాకుండా ప్రతిపక్షాల నుంచి ఒత్తిడి పెరిగిం ది. గ్రామస్థులు చేసిన ఆందోళనలకు బీజేపీ , కాంగ్రెస్‌ పార్టీలు కూడా మద్దతు పలికాయి. బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి, కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు రామారావు పటేల్‌తో పాటు తదితరులు పూర్తిస్థాయిలో మద్దతునివ్వడమే కాకుండా పలు ఆందోళనల్లో పాల్గొని బాధితుల పక్షాన నిలబడ్డారు. ప్రస్తుతం ముథోల్‌ నియోజకవర్గంలో గుండెగావ్‌ వ్యవహారం పొలిటికల్‌ చర్చకు తావిస్తోందంటున్నారు. 

ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ వర్తింపు..

గుండెగావ్‌ ముంపు బాఽధితులకు ఆర్‌ అండ్‌ఆర్‌ ప్యాకేజీని వర్తింపజేయబోతున్నారు. రెండు దశాబ్దాల నుంచి గుండెగావ్‌ ముంపు బాధితులు తమకు నష్ట పరిహారం, పునరావాసాన్ని ఆర్‌అండ్‌ ఆర్‌ ప్యాకేజీ కింద అందించాలని డి మాండ్‌ చేస్తూ వస్తున్నారు. ప్రభు త్వం ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీకి ప్రాధాన్యతనివ్వకుండా సాధార ణ పరిహారాన్ని అందించి పునరావాసం కల్పిస్తామంటూ ప్రకటించింది. దీంతో గుండెగావ్‌ బాధితులు ప్రభుత్వ ప్రతిపాదనలను తిరస్కరించి పోరుబాటకు సిద్ధమయ్యారు. ఎన్నికల సమయంలో ఓట్లు అడిగేందు కు వచ్చిన అధికార పార్టీ నాయకులను, ప్రతిపక్ష నాయకులను సైతం తమ సమస్యను పరిష్కరించాలంటూ నిలదీశారు. అయితే గుండెగావ్‌ బాఽధితుల నుంచి రోజు రోజుకు ఒత్తిడి పెరగడం, ప్రతిపక్షాలు విమర్శల దాడిని కొనసాగించడంతో ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీపై దృష్టి సారించారు. ఇప్పటికే జిల్లాలోని సదర్‌మాట్‌ బ్యారేజీ కింద భూములు కో ల్పోయిన రైతులకు అలాగే హైలేవల్‌ కెనాల్‌ కింద తాజాగా భూము లు కోల్పోయిన వారికి కూడా ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద పరిహారం అందించారు. దీంతో గుండెగావ్‌ బాధితులు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీపై మరిన్ని ఆశలు పెంచుకున్నారు. ఎట్టకేలకు ప్రభుత్వం ఈ అంశంపై లోతుగా పరిశీలించి పరిహారం, పునరావాసాన్ని ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద వర్తింపజేసేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. 

ఇప్పటికీ పూర్తి 

కాని  ప్రాజెక్టు


నిర్మల్‌ జిల్లా భైంసా మండలంలోని గుండెగావ్‌ సమీపంలోని చిన్న సుద్దవాగుపై పల్సీకర్‌ రంగారావు ప్రాజెక్ట్‌ ను నిర్మించ తలపెట్టారు. ఏళ్ల క్రితం ఈ పనులను ప్రారంభించినప్పటికీ ఇప్పటివరకు ప్రాజెక్ట్‌ పనులు పూ ర్తి కావడం లేదు. నిధుల కొరత ఓ వైపు, సాంకేతి క, క్షేత్రస్థాయి సమస్యలు మరోవైపు దీనికి అడ్డు తగిలాయి. అలాగే ముంపు సమస్య కూడా నిర్మాణానికి ఆటంకమయ్యింది. భూములు కోల్పోయిన గుండెగావ్‌ ముంపు బాధితులు తమకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద పునరావాసం కల్పించాలంటూ చేపట్టిన ఆందోళన పనులపై కూడా ప్రభావం చూపింది. ఎట్టకేలకు ప్రభుత్వం బాధితుల ఆందోళనకు దిగి వచ్చి రూ. 61.31 కోట్లను మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది. ఈ నిధులతో ప్రాజెక్ట్‌ నిర్మాణంలో మిగిలిపోయిన పనులు, కట్ట విస్తరణ, కాలువల పనులు లాంటివి చేపట్టనున్నారు. మిగతా నిధులను పునరావాసం కోసం ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద అందించాలని నిర్ణయించారు. ఈ నిధులతో చేపట్టే పనుల కారణంగా గుండెగావ్‌ గ్రామస్థుల ముంపు స మస్య శాశ్వత పరిష్కారానికి నోచుకోనుందంటున్నారు.

ఫలించిన పోరాటం..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ పాలకుల హయాం నుంచి పల్సీకర్‌ రంగారావు ప్రాజెక్ట్‌ పను లు ముందుకు సాగడం లేదు. చాలాసార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ పాలనలో ఆందోళనలు చేపట్టినప్పటికీ పెద్దగా పట్టించుకోలేదు. ప్రతీ ఏటా వర్షకాలంలో గుండెగావ్‌ గ్రామస్థుల పరిస్థితి దయనీయంగా మారుతుండడం సహజమైంది. పల్సీకర్‌ రంగారావు ప్రాజెక్ట్‌ బ్యాక్‌ వాటర్‌ కా రణంగా ఈ గ్రామాన్ని ప్రతీ వర్షకాలం లో భైంసా పట్టణానికి తరలిస్తున్నారు. ఎ మ్మెల్యే విఠల్‌రెడ్డి, మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డిలు కొద్ది నెలల నుంచి గుండెగావ్‌ సమస్య పరిష్కరించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. వీరి ఒత్తిడి మేరకే ప్రభుత్వం దిగి వచ్చి ఎట్టకేలకు ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీని వర్తింపజేస్తామంటూ ముందుకు రా వడం పట్ల అ భినందిస్తున్నారు. 

Updated Date - 2022-08-01T06:55:57+05:30 IST