రెండో పెళ్లికి రెడీ అయిన తల్లి.. కన్నబిడ్డను వదిలించుకునేందుకు భారీ స్కెచ్.. పసికందని కూడా చూడకుండా..

ABN , First Publish Date - 2021-10-04T02:17:03+05:30 IST

తొమ్మిది నెలలపాటు మోసి.. పురిటినొప్పులను తట్టుకుని బిడ్డకు జన్మనించి ఓ మహిళ చేసిన పని ప్రస్తుతం చర్చనీయాంశం అయింది. రెండో పెళ్లి కోసం కన్న బిడ్డను ఆ మహిళ అమ్మకానికి పెట్టడంతో ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది. తమిళనాడులో చోటు చేసుకున్న ఈ ఘటన

రెండో పెళ్లికి రెడీ అయిన తల్లి.. కన్నబిడ్డను వదిలించుకునేందుకు భారీ స్కెచ్.. పసికందని కూడా చూడకుండా..

ఇంటర్నెట్ డెస్క్: తొమ్మిది నెలలపాటు మోసి.. పురిటినొప్పులను తట్టుకుని బిడ్డకు జన్మనించి ఓ మహిళ చేసిన పని ప్రస్తుతం చర్చనీయాంశం అయింది. రెండో పెళ్లి కోసం కన్న బిడ్డను ఆ మహిళ అమ్మకానికి పెట్టడంతో ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది. తమిళనాడులో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లెకి వెళితే..


తమిళనాడులోని విరుద్ నగర్ జిల్లాకు చెందిన మణికందన్‌కు 2019లో ట్యూటికోరన్ జిల్లాకు చెందిన జెబమలార్ అనే యువతితో వివాహం జరిగింది. ఈ క్రమంలో వీరు ఓ బాబుకు జన్మనిచ్చారు. చక్కగా సాగిపోతున్న వారి సంసారంలో అకస్మాత్తుగా అలజడి మొదలైంది. దీంతో భార్యభర్తలు ఇద్దరూ విడిపోయారు. ఈ క్రమంలో జెబమలార్ బాబుతో సహా పుట్టింటికి వచ్చేసింది. కాగా.. భార్యభర్తలను కలపడానికి ప్రయత్నించకుండా.. జెబమలార్ కుటుంబ సభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. జెబమలార్‌కు రెండో పెళ్లి చేసేందుకు రెడీ అయ్యారు. ఈ క్రమంలో జెబమలార్‌కు ఇదివరకే పెళ్లైందని, బాబు కూడా ఉన్నాడని తెలియడంతో కొందరు ఆమెను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించారు. దీంతో జెబమలార్ కీలక నిర్ణయం తీసుకుంది. కుటుంబ సభ్యుల సహకారంతో తనకు పుట్టిన బిడ్డను వెరొకరి అమ్మేయాలని డిసైడ్ అయింది. ఓ బ్రోకర్‌ను సంప్రదించి.. సెల్వమణి (52), శ్రీదేవి (40) దంపతులకు తనకు పుట్టిన బిడ్డను రూ. 3లక్షలకు విక్రయించింది. 



ఈ విషయం మణికందన్ దృష్టికి వెల్లడంతో.. అతడు బెజమలార్ ఇంటికి వెళ్లాడు. అక్కడ బెజమలార్‌తో గొడవకు దిగి.. బాబును ఎవరికి విక్రయించారనే సమాచారాన్ని తెలుసుకున్నాడు. అనంతరం నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి.. ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు.. విచారణ చేపట్టి, బాబును సురక్షితంగా మణికందన్‌కు అప్పగించారు. కాగా.. ప్రస్తుతం బెజమలార్‌తో సహా ఆమె కుటుంబ సభ్యులు పరారీలో ఉండగా.. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 


Updated Date - 2021-10-04T02:17:03+05:30 IST