Advertisement
Advertisement
Abn logo
Advertisement

అంతర్జాతీయ అందాల పోటీలో... కేరళ అమ్ముకుట్టి!

పేరు సెరా రతీశ్. వయస్సు మూడేళ్లు. ఆల్రెడీ దుబాయ్ బయలుదేరింది. ఎందుకు అంటారా? అందాల పోటీలో పొల్గొనటానికి! భారతదేశం తరుఫున అంతర్జాతయ వేదికపై ప్రాతినిధ్యం వహించటానికి! 


మూడేళ్ల పాప అందాల పోటీలో పాల్గొనటం కాస్త ఆశ్చర్యమే కానీ, నిజం. కేరళలోని కొల్లంకి చెందిన ఆర్ఎల్వీ రతీశ్ జేమ్స్ వృత్తి రిత్యా డ్యాన్సర్, కొరియోగ్రాఫర్. ఆయన భార్య పేరు లెయిడా. వారిద్దరి గారాల పట్టి సెరా. ఈ గార్జియస్ బ్యూటీ మూడేళ్లకే ‘జూనియర్ మోడల్ ఇంటర్నేషనల్ 2021 వరల్డ్ ఫ్యాషన్ షో’లో పాల్గొనబోతోంది. అయితే, దుబాయ్‌లో జరగనున్న అంతర్జాతీయ అందాల పోటీలో అందరూ పాపాయిలే పాల్గొంటారు. మొత్తం ఇరవై దేశాల నుంచీ అరవై మంది పిల్లలు ర్యాంప్‌పై మాయ చేయనున్నారు. అందులో భారతదేశం తరుఫున క్యాట్ వాక్ చేసే ఛాన్స్ సెరా రతీశ్‌కు లభించింది. అయిదు నెలల క్రితం ఆన్‌లైన్‌లో జరిగిన ‘నేషనల్ జూనియర్ మోడల్ ఫ్యాషన్ షో’ పోటీలో సెరా ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. దాంతో ఇంటర్నేషనల్ బ్యూటీ పేజెంట్‌కు తనకి రూట్ క్లియర్ అయింది. చూడాలి మరి, మన మూడేళ్ల సుందరి... అందాల కిరిటీం దేశానికి తీసుకొస్తుందో లేదో...  

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement