రెడ్‌జోన్‌తో పటిష్టంగా లాక్‌డౌన్‌

ABN , First Publish Date - 2020-04-08T09:14:58+05:30 IST

బద్వేలును రెడ్‌జోన్‌గా ప్రకటించడం తో లాక్‌డౌన్‌ కట్టుదిట్టంగా అమలు చేస్తూనే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు

రెడ్‌జోన్‌తో పటిష్టంగా లాక్‌డౌన్‌

గ్రామాల్లో క్లోరినేషన్‌ 

మాంసం దుకాణ దారులకు పోలీసుల కౌన్సెలింగ్‌ 

బద్వేలు, పోరుమామిళ్లలో ఎస్పీ అన్బురాజన్‌ తనిఖీ


బద్వేలు, ఏప్రిల్‌7: బద్వేలును రెడ్‌జోన్‌గా ప్రకటించడం తో లాక్‌డౌన్‌ కట్టుదిట్టంగా అమలు చేస్తూనే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడుతున్నారు. రెవెన్యూ, వైద్య, పోలీసు, మున్సిపల్‌ అధికారు లు, పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలు ప్రశంసనీయంగా చెప్పుకోవచ్చు. స్వచ్ఛంద సేవా సంస్థలు, యువజన సంఘాలు పేదలు, నిరాశ్రయులకు ఇబ్బంది లేకుం డా ఆహారం, సరుకులు అందిస్తున్నారు. బద్వేలులో ఒకరికి కరోనా పాజిటివ్‌  కావడంతో ఆ ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటిస్తూ స్థానిక నివాసితులకు జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు. బద్వేలు పట్టణంలో మొత్తం మూడు పాజిటివ్‌ కేసులు నమోదుతో మాంసం దుకాణాలు మూసివేయాలని, చికెన్‌, మటన్‌ విక్రయిస్తే చర్యలు తప్పవని సీఐ రమే్‌షబాబు దుకాణ దారులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి శ్రీనివాసు లు ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ చేశారు. 


బద్వేలు, పోరుమామిళ్లను తనిఖీ చేసిన ఎస్పీ 

బద్వేలు రూరల్‌: కరోనా నియంత్రణలో భా గంగా మంగళవారం ఎస్పీ అన్బురాజన్‌ బద్వేలు, పోరు మామిళ్లను తనిఖీ చేశారు. పోరుమామిళ్ల వద్ద జిల్లా సరిహద్దు చెక్‌ పోస్టువద్ద ప్రతివాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి వివరాలను నమోదుచేయాలని ఎస్పీ పేర్కొన్నారు.  బద్వేలు అర్బన్‌, రూరల్‌ సీఐలు రమే్‌షబాబు, వెంకటచలపతి ద్వారా వివరాలు అడిగితెలుసుకున్నారు. కోర్‌జోన్‌  ప్రజలకు సహకరించాలని ఆదేశించారు. 


గ్రామాల్లో క్లోరినేషన్‌

గోపవరం: కరోనా పాజిటివ్‌ కేసులు పెరిగిపోతుండడంతో గ్రామాల్లోనూ ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పంచాయతీ అధికారులు పారిశుద్ధ్యం మెరుగు, వైరస్‌ నిర్మూలించేందుకు సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని స్ర్పేచేస్తున్నారు. ఈఓపీఆర్‌డీ విజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ ఉద్యోగులు బేతాయపల్లె, రా మాపురం, సండ్రపల్లెల్లో యూపీఎల్‌ యంత్రం ద్వారా స్ర్పే చేశారు. పంచాయతీ కార్యదర్శులు వెంకటసుబ్బ య్య, సచివాలయ ఉద్యోగులు మనోజ్‌, సందీప్‌, ప్రవీణ్‌, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


నాలుగు పంచాయతీల్లో...

కాశినాయన : కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా మండలంలో ముమ్మరంగా నివారణ చర్యలు చేపట్టినట్ల్లు ఎంపీడీఓ ముజఫర్‌ రహీం తెలిపారు. నర్సాపు రం, గంగనపల్లె, గొంటువారిపల్లె, బాలాయపల్లె పంచాయతీల్లో బ్లీచింగ్‌ పౌడర్‌ను నీటిలో కలిపి పిచికారి చేయించామన్నారు. ఒకటి రెండు రోజుల్లో మిగిలిన పంచాయతీల్లో పిచికారి చేయిస్తామన్నారు.

Updated Date - 2020-04-08T09:14:58+05:30 IST